అమెరికా మందుల నియంత్రణ డిపార్ట్మెంట్( FD FDA) తాజాగా ఓ విస్తుపోయే నిజాన్ని బయట పెట్టింది. జేబి కెమికల్స్, సోలారా యాక్టివ్, స్ట్రైడ్ ఫార్మా సైన్స్ కంపెనీలు తయారు చేస్తున్న ర్యానిటిడిన్ మాత్రలలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని, అందుకే తక్షణమే ఆ మాత్రల తయారీని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ తయారుచేసిన మాత్రలను నాశనం చేయాలని, మెడికల్ షాప్ లలో ఉన్న మాత్రలను కూడా విక్రయించకూడదని తెలిపింది.


2018వ సంవత్సరంలో ర్యానిటిడిన్‌లో హానికరమైన కలుషితాలు కలిగి ఉన్నాయనే అనుమానం US FDA కి వచ్చింది. దాంతో రెండు సంవత్సరాల పాటు ఆ మాత్రల వినియోగాన్ని పరిమితం లో ఉండాలని చెబుతూ... మరోవైపు ఆ మాత్రలపై లోతుగా దర్యాప్తు చేసింది. అయితే వారి రెండు సంవత్సరాల దర్యాప్తు లో ర్యానిటిడిన్‌ మాత్రలలో ఎన్‌-నైట్రోసొడిమెథైలమైన్‌ (NMDA) అనే కాన్సర్‌ కారకాలు ఉన్నట్లు నిర్ధారణైంది. దాంతో వెంటనే ఈ మాత్రలను తయారు చేసే సంస్థలన్నిటికీ ఒక నోటీసు జారీ చేసి వెంటనే ఆపేయాలని ఆదేశించింది.


ఇంతకీ ఈ మాత్రలను ఎందుకు వాడతారు అంటే... కొంతమంది పెద్ద వారికి కడుపులో గ్యాస్ ప్రాబ్లం, అల్సర్ ప్రాబ్లం, కడుపులో మంట లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే అటువంటి అనారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ర్యానిటిడిన్‌ మాత్రలను వాడతారు ప్రజలు. మన భారతదేశంలోని బెంగళూరు ముంబై లాంటి మహానగరాల్లో ర్యానిటిడిన్‌ మాత్రలను తయారు చేసే కొన్ని సంస్థలున్నాయి. వీటి ద్వారా మన భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఈ మాత్రల ఎగుమతి జరుగుతుంది.


దీన్ని బట్టి చూస్తే మన దేశ ప్రజలు కూడా ర్యానిటిడిన్‌ మాత్రలను వాడుతారని తెలుస్తుంది. మరి ర్యానిటిడిన్‌ మాత్రలలో ఎన్‌-నైట్రోసొడిమెథైలమైన్‌ (NMDA) అనే కాన్సర్‌ కారకాలు ఉన్నట్లు తెలిసిన మన భారతదేశం ఈ మాత్రలను ఎప్పుడు బ్యాన్ చేస్తుందో చూడాలిక. పై ఫోటోలో కనిపిస్తున్న 'Zantac' లో ర్యానిటిడిన్‌ మాత్రలు ఉంటాయన్నమాట. Zantac అనేది ర్యానిటిడిన్‌ మాత్రలను విక్రయించే ఒక బ్రాండ్. సో, ఒకవేళ మీరు ఈ మాత్రలు వాడుతుంటే వెంటనే ఆపి వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: