చైనాలో ఇటీవ‌ల పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లో విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు క‌రోనా కేసులు మ‌రియు మ‌ర‌ణాలు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10లక్షల 98వేలకు పైగా క‌రోనా కేసులు నమోదు కాగా..  59వేల 140మంది కరోనాతో మృతి చెందారు. వరల్డ్ వైడ్ గా నిన్న ఒక్కరోజే  82వేల కొత్త కరోనా కేసులు నమోదవగా, 6వేల మంది మరణించారు. దీంత్ర ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గ‌ర‌వుతున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ప్రపంచంలోని సగం దేశాలలో లాక్‌డౌన్ అమలవుతోంది. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

 

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సైతం క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు 161గా కేసులు రాత్రికి మరో మూడు పెరిగి 164కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. తాటిచెట్లపాలెంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో అక్క‌డ తీవ్ర క‌ల‌క‌లం రేగింది. ఈ క్ర‌మంలోనే జీవీఎంసీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ఇంట్లో ఉన్న ముగ్గురు సహా 17 నెల‌ల బాలుడి.. భవనం పై పోర్షన్, కింది పోర్షన్‌లో ఉన్న పదిమందిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.

 

ఇక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో జీవీఎంసీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శాస్ర్తి, సహాయ వైద్యాధికారి డాక్టర్‌ రాజేశ్‌ తదితరులు తాటిచెట్లపాలెంలో పర్యటించారు. అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అడుగడుగునా బ్లీచింగ్‌, జీవీఎంసీ వాహనంతో క్లోరిన్‌ వాటర్‌, ట్యాంకర్‌తో కెమికల్‌ స్ర్పే చల్లారు. మ‌రియు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, పారిశుధ్య, ఆరోగ్య విభాగం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మరింత సర్వే చేశారు. అంతేకాకుండా, పోలీసులు చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకు ఎవరినీ అనుమతించకుండా రాకపోకలను బంద్‌ చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: