మొదటి నుండి కూడా కేంద్రప్రభుత్వం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలుగు ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. బ్యాంకుల విలీనం సందర్భంగా మరోసారి ఆ విషయం స్పష్టమైపోయింది. దాదాపు 93 సంవత్సరాలుగా తెలుగు వాళ్ళ కీర్తి ప్రతీకలను ప్రపంచవ్యాప్తం చేసిన ఆంధ్రాబ్యాంకును కేంద్రం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేసింది. విలీనం చేస్తే చేసింది బ్యాంకు పేరును ఆంధ్రాబ్యాంకుగానే కంటిన్యు చేయమని స్వయంగా జగన్మోహన్ రెడ్ది కేంద్రానికి లేఖ రాశాడు. జగన్ కాకుండా చాలామంది ఎంపిలు, ప్రముఖులు కూడా కేంద్రానికి లేఖ రాసిని ఏమాత్రం లెక్క చేయలేదు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటి నుండి తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి ఏపి విషయంలో మోడి వైఖరి ఏమిటో స్పష్టమైపోతోంది. 2014 లో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా విభజన హామీలను అమలు చేస్తామని ఎన్నో మీటింగుల్లో చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కేయటం మొదలుపెట్టాడు.

 

విభజన హామీల్లో ప్రధానమైన ఏపికి ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్, ఆర్దిక లోటు భర్తి లాంటి అనేక హామీలను గాలికొదిలేశాడు. మోడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న విషయం తెలుస్తున్నా అప్పట్లో చంద్రబాబునాయుడు నోరెత్తలేకపోయాడు. పైగా మోడి చెప్పిన ప్రతిదానికీ భజన చేయటంతో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే వాడే లేకపోయాడు.  సరే ఆ విషయాలను పక్కన పెట్టేసినా ఆంధ్రాబ్యాంకు విలీనం విషయంలో అయినా జనాల మాటకు విలువిస్తాడని అనుకుంటే ఇక్కడా అదే సీన్ రిపీటయ్యింది.

 

యూనియన్ బ్యాంకు అంటే ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకం కాదని తెలిసిపోతోంది. అదే ఆంధ్రాబ్యాంకంటే ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబందించిన బ్యాంకని అందరికీ తెలుసు. కాబట్టి రెండు బ్యాంకులను విలీనం చేసినా పేరు మాత్రం ఆంధ్రాబ్యాంకు అనే కంటిన్యు చేసినా నష్టం లేదు. కానీ మోడి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. మోడి వైఖరి చూస్తుంటే అసలు ఆంధ్రా అనే పదమే వినబడకుండా చేయాలని అనుకున్నాడేమో. అందుకనే విలీనం తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఉంచారు. ఏపి కాబట్టి సరిపోయింది అదే తమిళనాడు లేదా కర్నాటక ప్రజల మనోభావాలతో మోడి ఆడుకోగలడా ?

మరింత సమాచారం తెలుసుకోండి: