భార‌త్‌లో వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనాను అదుపు చేయ‌డానికి లాక్‌డౌన్‌ను మించిన ప్ర‌త్యామ్నాయం ఏమి లేదా..? అంటే అవున‌నే అంటున్నాయి వైద్య వ‌ర్గాలు. అయితే మూడు నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో లాక్‌డౌన్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ  పొడ‌గింపు ఉంటుంద‌న్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం అదేం లేదు.లాక్‌డౌన్‌ను ముందుగా ప్ర‌క‌టించిన ఏప్రిల్ 12న ఎత్తివేయ‌డం జ‌రుగుతుంద‌న స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. 

 

ఇదే విష‌యాన్ని ప‌లువురు మంత్రులు కూడా ధ్రువీక‌రిస్తూ ప్రెస్ ఎదుట  చెప్పారు. అయితే మూడు నాలుగు రోజులుగా క‌రోనా మ‌హమ్మారి దేశ వ్యాప్తంగా ప్ర‌బ‌లిన‌ట్లుగా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఇక ఇందులో 10 కరోనా హాట్ స్పాట్ల‌ను గుర్తించారు. అంటే క‌రోనా వైర‌స్ ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువ‌గా ప్ర‌బ‌లుతున్న ప్ర‌దేశాల‌న్న‌మాట‌. మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న ముస్లింల నుంచి దాదాపు ప్ర‌తీ రాష్ట్రానికి ఇప్పుడు క‌రోనా దిగుమ‌తి అయింది. మూల మూల‌న చేరిపోయిందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రాన్నే ఉదాహ‌ర‌ణ‌కు తీసుకుంటే గ‌డిచిన 48గంట‌ల్లో  ఖ‌మ్మం మిన‌హా ఇక అన్ని జిల్లాల‌ను క‌రోనా వేగంగా విస్త‌రించింది.  

 

వ‌రంగ‌ల్‌ల్లో 23 కేసులు న‌మోదు కావ‌డంతో జ‌నం ఆందోళ‌న చెందుతున్నారు. మ‌ర్క‌జ్‌కు వెళ్లి వ‌చ్చిన వారితో వ‌రంగ‌ల్‌లో క‌రోనా ప్ర‌బ‌ల‌డంతో ఇప్పుడు ఇక్క‌డి ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. వంద‌లాదిగా జ‌నం క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రుల వ‌ద్ద క్యూ  క‌డుతున్నారు. తెలంగాణ‌లోనే మారుమూల ప్రాంత‌మైన ములుగులోనూ రెండు క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్రమంలో ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ ఎత్తివేసే దుస్సాహ‌సం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా..? అనేది కోట్లాది మందిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) భారత్‌లో లాక్‌డౌన్‌, ప్రస్తుత పరిస్థితులపై ఓ రిపోర్టును వెలువరించింది. 

 

బీసీజీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. ‘దేశంలో లాక్‌డౌన్‌ను జూన్‌ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్‌ వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్‌డౌన్‌ను ప్రకటించడం కన్నా.. దానిని ఎత్తివేయడం చాలా కష్టతరమైన విషయమంటూ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం  ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని అనుకోవడం లేదు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తరువాత వైరస్‌ను అదుపుచేయడం భారత్‌ వైద్యులకు అంత సులువైనది కాదు. వైరస్‌ వ్యాప్తి తగ్గకముందే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇబ్బందులు తప్పవు’ అని పేర్కొంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: