కరోనా వైరస్ కారణంగా అందరికి పరిశుభ్రత పెరిగింది ఒక్క ట్రంపుకు తప్ప.. అమెరికా అంత కంపు కంపు చేసేలా ఉన్నాడు ఈ ట్రంపు. ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. కరోనా వైరస్ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ ఉంది అంటే ఈజీగా చెప్పేయచ్చు.. అది ఉన్నది అమెరికాలోనే అని.. 

 

ప్రపంచంకో అన్నిటికంటే అమెరికాలోనే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ ఉంది. ఈ కరోనా బారిన పడి ఇప్పటికే అమెరికాలో ఏకంగా ఏడు వేలమంది పడి ప్రాణాలు కోల్పోయారు.. లక్షల సంఖ్యలో ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని ప్రజలందరూ మాస్కులు ధరించాలి అని డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. 

 

అయితే ఇందుకోసం మెడికల్‌ మాస్కులు కాకుండా సాధారణ మాస్కులు, చేతి రుమాళ్లు, ఇంట్లో తయారుచేసిన మాస్కులు ధరిస్తే మంచిది అని అయన అన్నారు. ఇంకా ఇదే విషయాన్ని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ సిఫార్సు చేసిందని అయన స్పష్టం చేశారు. అయితే ప్రజలు దీన్ని స్వచ్ఛందంగా పాటించాలని.. సామజిక దూరం తప్పనిసరిగా పాటించాలని అయన సూచించారు.

 

ఇంకా అదే సమయంలో తాను ఎట్టి పరిస్థితుల్లో మాస్కు వేసుకోనని ట్రంప్‌ స్పష్టంగా చెప్పాడు. అయితే ఇలా చెప్పడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఎందుకు ట్రంపు అమెరికాను కంపు చెయ్యాలనుకుంటున్నావ్ అని ఒకరు అంటే మరొకరు స్పందిస్తూ.. మాస్క్ వేసుకోడానికి ఎందుకు అంత నామోషీ ట్రంపు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం ట్రంపు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: