అవును తిరుమల అడవుల్లోని  వన్య ప్రాణులు పండగ చేసుకుంటున్నాయి. దేశవ్యాప్త లాక్ డౌన్లో భాగంగా తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసేసిన సంగతి అందరికీ తెలిసిందే. గడచిన 15 రోజులుగా శ్రీవారి ఆలయాన్ని మూసేసిన కారణంగా భక్తులెవరూ తిరుమలకు రావటం లేదు. ఎటూ భక్తులను రావద్దని చెప్పేశారు కాబట్టి తిరుపతిలోని అలిపిరి దగ్గర టోల్ గేటు కూడా మూసేశారు. దాంతో తిరుపతి-తిరుమల మధ్య వాహనాల రాకపోకలు దాదాపుగా ఆగిపోయాయనే చెప్పాలి.

 

మామూలుగా అయితే 24 గంటల్లో కనీసం 18 గంటల పాటు తిరుమల ఘాట్ రోడ్లలో వాహనాల రణగొణ ధ్వనులు వినిపిస్తునే ఉంటాయి. అలాంటిది ఇపుడు 24 గంటల్లో ఒక్క వాహనం కూడా రావటం లేదు, పోవటం లేదు. దాంతో  రెండు ఘాట్ రోడ్లు పూర్తిగా నిర్మానుష్యమే.  దీంతో  ఇపుడు వన్యప్రాణులు హ్యాపీగా ఫీలవుతునే ఉంటాయనటంలో సందేహం లేదు.  ఎందుకంటే దట్టమైన అడవుల మధ్య వందల ఏళ్ళ క్రితం తిరుమల కొండలపైన శ్రీవారి వెలిశారు. అప్పటి నుండే భక్తుల తాకిడి మొదలైంది. 

 

ఎప్పుడైతే భక్తుల తాకిడి మొదలైంది అప్పటి నుండి ప్రాణులకు కష్టాలు మొదలయ్యాయి. తమ నివాస ప్రాంతాల్లోకి జనాలు చొచ్చుకు రావటంతో వన్య ప్రాణులు అడవుల్లోపలకు ఎక్కడకో వెళ్ళిపోయాయి. ఇపుడు తిరుమలకు వెళ్ళే వాళ్ళకు కానీ లేకపోతే దిగే వాళ్ళకు కానీ ఎప్పుడైనా పులులు, జింకలు, దుప్పులు, ఏనుగులు ఎదురు పడుతుంటాయంతే. కానీ గడచిన రెండు వారులుగా నరసంచారం లేకపోవటంతో వన్య ప్రాణులు యధేచ్చగా అడవుల్లో నుండి బయటకు వచ్చి తిరుగుతున్నాయి.

 

సగుటున రోజుకు తిరుమల-తిరుపతి మధ్య 12 వేల వాహనాలు తిరుగుతుంటాయి. అంటే ఏ స్ధాయిలో వాహనాల రద్దీ ఉంటుందో్ అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది గడచిన 15 రోజులుగా వాహనాలే తిరగటం లేదంటే ఎంత ప్రశాంతంగా ఉందో అర్ధమవుతోంది, అందుకనే వన్యప్రాణులు కూడా ఘాట్ రోడ్లపైన కూడా హ్యాపీగా తిరిగేస్తున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: