ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. నిన్న తగ్గాయి అనుకునే సరికి ఈరోజు మరలా కరోన పడగ విప్పింది. నిన్నటివరకు ఏపీలో 164 కేసులు నమోదు కాగా ఇప్పుడు మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆంధ్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180 కి చేరింది.

 

రాష్ట్రంలో నిన్న రాత్రికి 164 కేసులు ఉండగా.. నిన్న రాత్రి 10: 30 నిమిషాల నుండి ఇవాళ ఉదయం 10 గంటల వరుకు కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఇప్పుడు సంఖ్య 180 గా ఉండగా అందులో నలుగురు కరోనా నుండి కోలుకున్నారు. విశాఖలో మరో మహిళా కూడా కరోనా నుండి కోలుకుంది.

 

కాగా ఆంధ్రలో 13 జిల్లాలో 11 జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇంకా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో - 32, గుంటూరు జిల్లా - 23, ప్రకాశం జిల్లా - 18, కడప జిల్లా - 23, కృష్ణా జిల్లా - 27, పశ్చిమ గోదావరి జిల్లా - 15, విశాఖపట్నం జిల్లా -15, తూర్పుగోదావరి జిల్లా - 11, చిత్తూరు జిల్లా - 10, అనంతపురం జిల్లా -2, కర్నూలు జిల్లా - 4 నమోదయ్యాయి.

 

అయితే ఆంధ్రాలో నెల్లూరు, గుంటూరు, కడప, కృష్ణ జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటికే 11 లక్షలమందికి వ్యాపించింది. అందులో 60 వేలమంది మృతి చెందారు. ఇతర జిల్లాలతో పోలిస్తే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలలో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: