ప్రస్తుతం కరోనా వైరస్ వలన లాక్ డౌన్ ప్రకటించి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు-కార్మికులకు పూర్తి జీతం ఇస్తే అండర్ గ్రౌండ్ మైన్స్‌ కార్మికులకు సగం జీతంతో కూడిన లే ఆఫ్ ప్రకటించడం అన్యాయం అని తెలిపారు. ప్రభుత్వం ఆదేశించినట్టుగానే లాక్ డౌన్ ప్రకటించాలే కానీ లే ఆఫ్ చేయకూడదంటున్నారు.  లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరిస్తూ సింగరేణి యాజమాన్యం తమ ఉద్యోగుల విషయంలో ఇదే నిర్ణయం అమలు చేయాలని భావిస్తోంది.  

 

తాజాగా మార్చినెల వేతనంలో సగం మాత్రమే చెల్లించాలని, మిగిలింది తర్వాత చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఈ నెలలో పదవీ విరమణ చేసిన కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించింది.  కాకపోతే ఎవరికీ 15 వేల కన్న తక్కువ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.  సింగరేణిలో NCWA ఉద్యోగులు మొత్తం సుమారు 43 వేల మంది ఉండగా వీరిలో 27 వేల మందికి మార్చి నెలలో సగం జీతం అందుకున్నా సరే 15 వేల రూపాయలకు పైగానే వస్తుంది.

 

కానీ, మిగిలిన సుమారు 13,600 మందిలో 15 వేల కన్నా తక్కువ జీతం వచ్చే వాళ్ళు ఉన్నారు.  అయితే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని 15 వేలకు తగ్గకుండా యాజమాన్యం కనీస వేతనం 15 వేలకు తగ్గకుండా చూడాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. ప్పటికే పండగ అడ్వాన్స్‌, సహకార సొసైటీ లోన్‌ రికవరీ, క్లబ్బు రికవరీలను వాయిదా వేశారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: