ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తన విశ్వరూపం చూపిస్తుంది. అన్ని దేశాలకు కరోనా వైరస్ కేసులు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి. కరోనా వైరస్ ని ఏ విధంగా కట్టడి చెయ్యాలో అర్ధం కాక ప్రపంచ దేశాలు అన్నీ కూడా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. దాదాపు అన్ని దేశాలు కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. 

 

1,118,059 మందికి కరోనా వైరస్ సోకింది. 59,206 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 229,153 మందికి కరోనా పూర్తి స్థాయిలో నయం అయింది. 829,700 మంది కరోనా వైరస్ కారణంగా చికిత్స పొందుతున్నారు. 790,296 (95%) మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 39,404 (5%) మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. వీరిలో 29 వేల మంది మరణిస్తారని అంటున్నారు. 

 

మన దేశంలో కూడా కరోనా తన ప్రతాప౦ చూపిస్తుంది. మూడు వేలు దాటాయి కరోన కేసులు. దాదాపు 70 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. తాజాగా 16 కొత్త కేసులు బయటపడ్డాయి. అమెరికాలో కరోనా బాదితులు నరకం చూస్తున్నారు. అక్కడ మూడు లక్షల మందికి దాదాపుగా కరోనా సోకిందని అంచనా. మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: