ఒక్క మాటలో చెప్పాలంటే ఇపుడు ప్రపంచం అంతా ఐసీయూలో ఉన్నట్లే. మొత్తం  వందల కోట్ల జనాభా అంతా కూడా బిక్కచచ్చి ఉంది. ఎవరికి ఏ ఆపద ముంచుకొస్తుందో తెలియని అయోమయం, గందరగోళంలో అంతా ఉన్నారు. కరోనా పురుగు మొత్తం మానవాళి విద్వంశం చేయడానికి కత్తీ కటార్లు లేకుండానే బయల్దేరింది. కంటికి   కనబడకుండానే కధ ముగించేస్తోంది.

 

మొదట కరోనా వైరస్ వీర విహారం చేసిన చైనా ఇపుడు  బాగానే తేరుకుంది. దాని పుట్టినిల్లు ఊహాన్ లో ఇపుడు సాధారణ జీవనం సాగుతోంది. అక్కడ అంతా ఓకేగా ఉంది. జనాలు బిజీ లైఫ్ లో పడ్డారు. యధాప్రకారం బిజినెస్ లో కూడా పడ్డారు.

 

ప్రపంచం అంతా లాక్ డౌన్ కిందన మూతేసుకుని కరోనా తో కలవరపడుతూంటే చైనా ఏంచేస్తోంది. అంటే చాలా కూల్ గా నింపాదిగా ఉందిట. ఎప్పటి మాదిరిగానే తన బిజినెస్ తెలివితేటలకు పదును పెడుతోంది. ఇపుడు చైనా చేస్తున్న వ్యాపారం సంగతి తెలిస్తే అంతా ముక్కున వేలేసుకుంటారు. అంతే కాదు, ఇదేం పోయేకాలం అని కూడా మండిపడతారు.

 

కానీ చైనా పక్కా వ్యాపారి, అంతకంటే కూడా  ప్రపంచ అధిపత్యం కోసం ఆరాటపడుతున్న దురంకారి, అందుకు తగినట్లుగానే పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు సొమ్ము చేసుకోకుండా ఉంటుందా. అందుకే ఇపుడు చైనాలోని తొమ్మిది వేల కంపెనీలు అదే పనిగా మాస్కులను తయారు చేస్తున్నాయిట. రాత్రీ పగలు ఇదే పని మీద ఉంటున్నాయట.

 

ప్రపంచం మొత్తం మీద మాస్కుల కొరత తీవ్రంగా ఉంది. దాంతో చైనాలో మాస్కుల వ్యాపారనికి తెర లేచింది. దాంతో అన్ని దేశాలకు వాటిని పెద్ద ఎత్తున విక్రయిస్తూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటోంది. చైనా సరుకులు అంటే ప్రపంచానికి మోజు ఎపుడూ ఉన్నదే. పైగా మాస్కుల తయారీలో పేటెంట్ హక్కులు కూడా  ఉన్న చైనా ఇపుడు వాటితోనే తన బిజినెస్ ని రెట్టింపు చేసుకుంటోంది.

 

పనిలో పనిగా చైనాలో వెంటిలేటర్ల తయారీ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున రాత్రీ పగలూ పనిచేస్తున్నాయట. ఇలా వెంటిలేటర్లను కూడా ప్రపంచ దేశాలకు సరఫరా చేసే పనిలో చైనా చాలా బిజీగా మారిపోయింది అంతే కాదు మెడికలు పరికరాలు కూడా ఇపుడు ప్రపంచానికి చాలా అవసరం. వాటిని కూడా తయారు చేస్తూ అంతే వేగంగా అందిస్తూ చైనా కాసుల పంటను పండించుకుంటోంది.

 

నిజానికి చైనాలో పుట్టిన కరోనా వైరస్ అదే చైనాని లాభాల కుప్పగా మార్చేయడం అతి పెద్ద వింత అయితే చైనా సుదీర్ఘ కాలం కోరిక అయిన ప్రపంచ పెద్దన్న పాత్రలోకి చాలా తొందరగా వెళ్ళేందుకు మార్గం సుగమం చేయడం కూడా అదే కరోనా వల్లనే సాధ్యపడింది. మొత్తానికి చైనా అంటే కరోనా అంటున్న వారు కూడా ఇపుడు భయపడుతున్నారు. ఎందుకంటే ఇపుడు అతి బలమైన పెద్ద దేశంగా ప్రపంచం ముందు చైనా నిల్చుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: