ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. కరోనా మహమ్మారిని కొంత వరకు అరకట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించారు. దేశంలో లాక్ డౌన్ గడువు ముగింపుకు దగ్గరికి వస్తున్నా కరోనా బాధితుల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ పంజా విసిరింది. 

 

రెండు రాష్ట్రాలలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది.

 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ ను విధించారు. అయితే కొంతమంది లాక్ డౌన్ నియమాలను కావాలనే పాటించడం లేదు. కొంత మంది ప్రజలు చిన్న చిన్న పనుల కోసం బయటికి వస్తున్నారు. మరికొంతమంది ఇంట్లో బోర్ కొట్టడంతో బయట కాలక్షేపం చేసేందుకు బయటికి వస్తున్నారు. కొన్ని గ్రామాలల్లో పేకాట, కోడిపందాలు ఆడుతూ యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణాజిల్లాలోని పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరులో కోడి పందాలు, పేకాటకు తెర వేశారు.

 

అయితే తోట్లవల్లూరు మండలంలో కనకవల్లి పొలాల్లో, గురివిందపల్లి మామిడి చెట్ల కింద, పొట్టి దిబ్బలంక, దేవరపల్లి గ్రామాల్లో పలువురు పేకాట ఆడుతున్నారు. తొట్లవల్లూరు ఎస్ఐ చిట్టిబాబు తన సిబ్బందితో కలిసి మారు వేషంలో పేకాటస్థావరాలపై మెరుపు దాడి చేశారు.

 

ఈ దాడుల్లో 18 మంది పేకాట రాయుళ్లను, కోడిపందాలు వేస్తున్న మరో నలుగురు నిందితులను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తంగా 24 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. నిందితుల నుండి రూ.28,710 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: