ప్రపంచాన్ని అస్త వ్యస్థం చేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు మన దేశంలో కూడా హడలెత్తిస్తుంది.  దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు దేశంలో 2,902 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 68 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారి కారణంగా దేశంలో వారం రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 ల ముగుస్తుందని.. అంటున్నప్పటికీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి పొడిగించినా ఆశ్చర్యం లేదంటున్నారు.

 

తాజాగా దీనిపై స్పందించిన మహరాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో  ముఖ్యంగా కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదువుతున్న ముంబయి లాంటి చోట్ల కొనసాగుతుందని అన్నారు.  అయితే  నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. హారాష్ట్రలో మొత్తం 67 కేసులు నమోదుకాగా, ఒక్క ముంబైలోనే 53 నిర్ధారణ అయ్యాయి.

 

అలాగే, ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, ముంబైలోనే నలుగురు చనిపోయారు. కరోనా వైరస్‌తో ధారవీలో చనిపోయిన వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే అతను  ఢిల్లీ తబ్లీగ్ జమాత్ మత సమ్మేళనానికి హాజరైన మహిళల ద్వారా ఈ వ్యక్తికి వైరస్ సోకి మరణించారని అధికారుల తెలిపారు.   ఇక ఏప్రిల్ 14 తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని రాజేశ్ తోపే అన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: