ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా తన ప్రతాపం చూపిస్తుంది. అన్ని దేశాలను ఈ వైరస్ అత్యంత వేగంగా చుట్టేస్తుంది. ఎన్ని విధాలుగా కట్టడి చెయ్యాలని చూసినా సరే పెరుగుతుంది గాని తగ్గడం లేదు. దీన్ని కట్టడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ప్రపంచం. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ తో పోరాటం చేస్తుంది. అన్ని దేశాలు కూడా ఇప్పుడు కరోన మీద దృష్టి పెట్టాయి. 

 

ఇది ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. 1,119,801 మందికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకింది. 59,247 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక 229,349 మందికి కరోనా వైరస్ నయం అయింది. 831,205 మంది ఇంకా కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నారు. 791,794 (95%) మంది ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. 39,411 (5%) మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 

 

మన దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిని చాటుతుంది. మన దేశంలో ఇప్పటి వరకు 3200 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణాలో 229 కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో 180 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా పెరుగుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: