జగన్ వైసీపీ అధినేత, అలాగే  ఏపీ ముఖ్యమంత్రి. బాలయ్య తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. పైగా ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్వయాన బావమరిది. ఇక ఏపీలో తెలుగుదేశం తీరు ఎలా  ఉందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ ముంచుకొచ్చినా కూడా జగన్ సర్కార్ మీద నిప్పులు చిమ్ముతూనే ఉంది. 

 

అసెంబ్లీ సమావేశాల్లో కూడా తిట్టుకోవడమే తప్ప ముఖాముఖాలు చూసుకుని పలకరించుకుని ఎరగని వైరం ఈ రెండు పార్టీల మధ్యన ఉంది. ఓ విధంగా జగన్ బాబు ఎపుడూ మామూలుగా ఎక్కడా కలుసుకున్న దాఖలాలు లేవు. రెండు రాజకీయ‌ పార్టీల స్థాయిని దాటి బద్ద శత్రువులుగా వైసీపీ టీడీపీ ఏనాడో మారిపోయాయి.

 

ఈ నేపధ్యంలో బాలక్రిష్ణ జగన్ని కలవడం అంటే అది వింతలోకెల్లా వింత. మరి బాలయ్య స్వయంగా  జగన్ని ఇంతవరకూ ఎక్కడా కలవలేదు. బాలయ్య అంటే జగన్ కి ఇష్టమే. ఆ మాటకు వస్తే కడప జిల్లా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ కుర్రాడిగా ఉన్నపుడు జగన్ నడిపారని అంటారు.

 

బాలయ్య సైతం జగన్ని ఇప్పటిదాకా ఎక్కడా విమర్శించిన దాఖలాలు లేవు. జగన్ కూడా బాలయ్యని ఎపుడూ పల్లెత్తు మాట అనలేదు. మరి వీరిద్దరి మధ్య మంచి సానుకూలత ఉన్నా  కూడా ఎపుడూ ఇద్దరూ భేటీ అవలేదు. కానీ ఇపుడు అవబోతున్నారుట.

 

కరోనా వైరస్ విషయంలో భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన బాలయ్య దాన్ని తానే స్వయంగా చెక్కు రూపంలో ఆయా ప్రభుత్వాలకు అందచేస్తున్నారు. ఆ విధంగా ఇప్పటికే తెలంగాణా సర్కార్ కి యాభై లక్షల రూపాయల విరాళాన్ని కేటీయార్ కు స్వయంగా బాలయ్య చెక్కు అందచేశారు.

 

ఇపుడు ఏపీ సీఎం జగన్ని కూడా స్వయంగా కలసి మరో యాభై లక్షల రూపాయలను చెక్కు రూపంలో అందించాలని అనుకుంటున్నారుట. తొందరలోనే జగన్ తో బాలయ్య భేటీ ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అదే కనుక జరిగితే హయ్యెస్ట్ టీయార్పీ రేటింగ్ ఈ ఇద్దరి ముచ్చటను చూపించిన టీవీ చానాళ్ళకు ఉండడం ఖాయమని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: