ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటూనే మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థలను దారుణ  స్థితికి చేరుస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా  వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ముమ్మర కసరత్తు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కడం లేదు. రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతూనే ఉంది. అయితే కేవలం సాధారణ ప్రజలకు మాత్రమే కాదు కరోనా  వైరస్ ఉన్న పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులు కూడా చాలామంది కరోనా  వైరస్ బారినపడి మృత్యువాత పడడం అందరినీ కలచివేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇద్దరు డాక్టర్లకు ఇలాగే కరోనా  వైరస్ సోకింది. 

 

 

 కరోనా  వైరస్ సోకిన బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యుడికి ఆయన భార్యకు కరోనా వైరస్ సోకింది. అయితే కరోనా వైరస్ సోకిన సదరు వైద్యుడి భార్య ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా కరోనా  వైరస్ సోకిన మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మొదటిసారి ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో నిజాముద్దీన్ సభ జరిగినప్పటి నుంచి రోజురోజుకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది కరోనా  సోకిన పేషెంట్లు ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 

 

 

 ఇక ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో రెసిడెంట్ డాక్టర్ గా  పనిచేస్తున్న డాక్టర్  కరోనా  వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తుండగా అతనికి కూడా కరోనా  వైరస్ సోకింది. అంతేకాకుండా ఆ వైద్యుడు భార్యకు కూడా కరోనా  వైరస్ సోకింది . అయితే ఆ మహిళకు కరోనా  వైరస్ సోకిన సమయంలో ఆ మహిళ తొమ్మిది నెలల నిండు గర్భిణీ గా ఉంది. ఇక కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆ వైద్యుడికి ఆయన భార్యకు ఐసోలేషన్ లో ఉంచి  వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు వైద్యుడి భార్యకు ప్రత్యేక చికిత్సను అందించారు అక్కడి వైద్య సిబ్బంది. ఇక కరోనా వైరస్ సోకిన సదరు మహిళకు సీ సెక్షన్  ద్వారా వారం రోజుల ముందే కాన్పు చేశారు అక్కడి వైద్యులు. ఆ తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా ప్రత్యేకంగా తల్లికి బిడ్డకు చికిత్స అందిస్తున్నట్లు అక్కడి వైద్యులు చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: