ప్రపంచంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది.  మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిపోతేంది.. ప్రతిరోజు దిన దిన గండంగా రోజులు గడుస్తున్నట్టుంది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ దిక్కుమాలిన వైరస్ ప్రపంచంలోని   ఇప్పటి వరకు 205 దేశాలకు విస్తరించింది. 11.18 లక్షల మందికి కొవిడ్‌-19 వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 59,200 మందికి పైగా కరోనా బాధితులు చనిపోయారు. ఇప్పటివరకు 2.29 లక్షల మంది కోలుకున్నారు. రోజు రోజుకీ మరణాల సంఖ్య మరింత పెరిగిపోంది.  ప్రపంచలో ఎంత గొప్ప సైంటిస్టులు కూడా దీనికి సరైన వ్యాక్సిన్ కనుగొనలేక పోతున్నారు.

 

  అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య అత్యధికంగా 2,77,475గా ఉంది. 7,402 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో 1,19,827 మందికి కరోనా సోకగా వారిలో 14,681 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 1,19,199 కేసులు నమోదుకాగా, 11,198 మంది మృతి చెందారు. జర్మనీలో 91,159  కేసులు నమోదుగాకా, 1,275 మంది ప్రాణాలు కోల్పోయారు. యూకేలో 38,168 కేసులు నమోదుకాగా, 3,605 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో 9216 మందికి సోకగా, 365 మంది చనిపోయారు. కెనడాలో 12,375 కరోనా కేసులు రాగా, 208 మంది మృతి చెందారు.

 

భారత దేశంలో కూడా ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.  ప్రతిరోజూ ఒక్క మరణమైనా సంబవిస్తూనే ఉంది.   ఇటీవల దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారి కారణంగా దేశంలో వారం రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాగా, దేశంలో మొత్తం 2,902 మందికి కరోనా వైరస్ సోకగా వారిలో 2,650 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 183 మంది కోలుకున్నారు.  ఓ వారం రోజులుగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం జమాత్ కు హాజరైన వారే కావడం గమనార్హం.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: