దేశంలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా ప్రభావం కారణంగా కేవలం మనుషుల ప్రాణాలు పోవడమే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా క్రమక్రమంగా క్షీణిస్తోంది. రోజురోజుకు భారత ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో దెబ్బతింటోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు 21 రోజుల లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రవాణా సంస్థ మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయింది.. కనీసం ఆటో టాక్సీ కూడా లేని పరిస్థితి ఏర్పడింది.ఏ  వాహనం కూడా రోడ్డెక్కి పరిస్థితి. ఈ నేపథ్యంలో టాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

 

 ఆటో, టాక్సీ డ్రైవింగ్ చేయడం ద్వారా రోజువారి వేతనం పైన జీవనం సాగించేవారు. ఇప్పుడు ఉపాధి కరువై  పస్తులు ఉండాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్  సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్యాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం ముందుకు వచ్చింది.ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రజలకు చేయూత ఇచ్చే  విధంగా ముందుకు నడుస్తున్నారు. 

 

 

 ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటికే 35 వేల మంది కార్మికులు ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో భవన నిర్మాణ రంగ కార్మికులకు ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అయితే కేవలం పేద ప్రజలకు మాత్రమే కాకుండా ఆటో టాక్సీ డ్రైవర్ లకు కూడా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రకటన చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. లాక్ డౌన్ నేపథ్యంలో  ఇబ్బందులకు గురవుతున్న ఆటో టాక్సీ డ్రైవర్ లకు తమ వంతు సాయంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటో ట్యాక్సీ ఎలక్ట్రిక్ రిక్షా డ్రైవర్ లకు వచ్చే 7 నుంచి 10 రోజుల్లో రాయితీలు చెల్లించబడతాయి అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: