ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని కట్టడి చేయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దెబ్బకు అగ్ర రాజ్యాలు కూడా ప్రాణ భయంతో అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దీన్ని కట్టడి చేయడానికి ఆర్ధికంగా కూడా భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,121,991 గా ఉంది. గంట క్రితం నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు వేలు పెరిగాయి కరోనా వైరస్ కేసులు. 59,403 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 230,317 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 832,271 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

 

792,827 (95%) మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 39,444 (5%) మంది విషమంగా ఉంది. అమెరికాలో కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉంది. మన దేశంలో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మూడు వేలు దాటింది సంఖ్య. మన దేశంలో బాగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలు. తెలగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది. తెలంగాణా 229 గా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ సంఖ్య 180గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: