తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ రోజురోజుకూ ముదురుతోంది. రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో తెలంగాణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కెసిఆర్ సర్కార్  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే... ఇక ఆ తర్వాత కేంద్రం కూడా లాక్ డౌన్ ప్రకటించడంతో ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ధనికుల  పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నిరుపేదల పరిస్థితి మాత్రం రోజురోజుకు అధ్వానంగా మారిపోతుంది. రోజువారి కూలి మీద జీవనం సాగించేవారు ఉపాధి కరువవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. 

 

 

 ఈ నేపథ్యంలో చాలామంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు మరికొంత మంది సామాన్య ప్రజలకు చేయూతనిచ్చేలా ముందుకు వస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సాయం చేస్తున్నారు. ఓ వైపు నుంచి తమని తాము రక్షించుకోవడానికి పేద ప్రజలకు శానిటైసార్లు,  మాస్కూలు,  ఉచితంగా అందజేస్తునే...  మరోవైపు నిత్యావసరాలను కూడా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఐపీఎస్ తనయుడు తన పెద్ద మనుషులు చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ మురళీ కృష్ణ తనయుడు టీవీ అనిరుద్ లాక్ డౌన్ సమయంలో తన పెద్ద మనుషులు చాటుకుని సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. 

 

 

 ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యేలా చేసేందుకు పోలీసులు నిర్విరామంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులకు పెద్ద ఎత్తున మాస్క్ లను శానిటైసర్లను  అందించారు అనిరుద్ బంజారాహిల్స్,  జూబ్లీహిల్స్,  సైఫాబాద్, నాంపల్లి, పంజాగుట్ట రాజగోపాల్ పేట మాదాపూర్ పోలీస్ స్టేషన్ లకు ఏకంగా మూడు వేల గ్లౌజులు, రెండువేల మాస్క్ లను , 1000 సానిటైసర్లను , మూడువేల వాటర్ బాటిల్స్ ను అందించారు. అంతేకాకుండా ఎన్బిటి నగర్, బంజారా హిల్స్,  కేన్సర్ హాస్పిటల్ పరిధిలోని 300 కుటుంబాలకు కూడా నిత్యావసర సరుకులను అందించారు అనిరుద్.

మరింత సమాచారం తెలుసుకోండి: