ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిపై ఎలా యుద్దానికైనా సిద్ద పడుతున్నారు మానవాళి.  ఇప్పటి వరకు ఏ వైరస్ కూడా ఈ స్థాయిలోప్రభావాన్ని చూపించలేదు.  ఒకదశలో కరోనా వైరస్ మానవాలి మనుగడనే ప్రశ్నిస్తుంది.  చిన్న దేశం నుంచి అగ్రరాజ్యమైన అమెరికా సైతం వణికిపోయే పరిస్థితి నెలకొంది.  ఇప్పటి వరకు ఎలాంటి యాంటీబైటిక్ కనుగొనలేకపోయారు.  ఈ పరిస్థితుల్లో కేవలం కరోనా రాకుండా జాగ్రత్తలు మాత్రమే సూచిస్తున్నారు.  ఎక్కడ దీన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు.  

 

దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  కానీ కొంత మంది నిత్యావసర సరుకుల కోసం రోడ్లపైకి వస్తున్నారు.  మరికొంత మంది ఆకతాయిలు కావాలని పోలీసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  కరోనాపై పట్టణవాసుల కంటే గ్రామీణప్రాంతాల ప్రజలే అప్రమత్తంగా ఉన్నారు.  పశ్చిమబెంగాల్‌లోని బుర్దాన్‌ జిల్లా జమల్పూర్‌, మెమారి గ్రామాల్లో వినూత్న ప్రయోగంతో కరోనాపై అవగాహన అయ్యేలా ప్లాన్ చేశారు.  గ్రామాల్లోని ఇండ్లపై ఇలాంటి వాల్‌ పెయింటింగ్స్‌ ఇప్పుడు కన్పిస్తున్నాయి.

 

ఈ వైరస్‌ బారిన పడకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అని పేర్కొంటూ కరోనాకు సంబంధిచిన వివరాలు గోడలపై ఉన్నాయి. ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలా గోడలపై కరోనా ప్రభావం గురించి రాతలు రాసి జనాల్లో అవగాహన తీసుకు వస్తే బాగుంటుందని అంటున్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: