కరోనా వైరస్(కోవిడ్ -19) ప్రతాపానికి 205 దేశాలు అల్లకల్లోలమవుతున్నాయి. ఈ వైరస్ జాడను తొలుత గుర్తించింది లీ వెన్లియాంగ్ అనే ఒక చైనీస్ డాక్టర్. గత డిసెంబర్‌లో ఆయన ప్రప్రథమంగా కరోనా వైరస్ గురించి ప్రపంచానికి వెల్లడించాడు. అయితే చైనా ప్రభుత్వం ఆయన్ని నానా వేధింపులకు గురిచేసింది.  దురదృష్టవశాత్తు డాక్టర్ లీ సైతం కొవిడ్ -19 బారిన పడి.. మృతి చెందారు. ఇక ఆ త‌ర్వాత వైర‌స్ ఏ స్థాయిలో ప్ర‌పంచ‌దేశాలు విజృంభించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంత‌.. శాస్త్ర‌వేత్త‌లు అంద‌రూ అదే ప‌నిలో ప‌డ్డారు.

 

అందులో హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కూడా ఒక‌టి. అయితే భారత్‌ బయోటెక్‌ కంపెనీ ముక్కు ద్వారా చుక్కల మందు రూపంలో వేసే టీకాను రూపొందించింది. కోరోఫ్లూ అని పిలుస్తోన్న ఈ టీకాను యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌ మాడిసన్‌, ఫ్లూజెన్‌ అనే వ్యాక్సిన్‌ కంపెనీలతో కలిసి భారత్ బయోటెక్ డెవలప్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ‘కరోనా వైరస్ ను నిరోధించేందుకు కోరోఫ్లూ అనే పేరుతో వాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్న మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్‌కు నా బెస్ట్ విషెస్. 

 

సీఎమ్‌డీ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఆయన టీమ్‌కు గుడ్‌ లక్. మీ అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్ అభినందించారు. కాగా, ఈ ఏడాది చివరి నాటికి హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించనుంది. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌తోపాటు ఉత్పత్తి బాధ్యతలను భారత్ బయోటెక్ చూసుకుంటుందని ఆ సంస్థ బిజినెస్ హెడ్ రాచెస్ ఎల్లా తెలిపారు. మొత్తం 30 కోట్ల డోసుల వ్యాక్సిన్‌‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. క్లోరోఫ్లూ టీకా జలుబు కారక వైరస్‌ యాంటీజెన్‌లను సైతం ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌‌తోపాటు ఇన్‌ప్లుయెంజా వైరస్‌పైనా పోరాటం చేస్తుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: