కరోనా మహమ్మారి మానవుల పాలిట శాపంగా మారింది... అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సృష్టిలో అత్యంత బలవంతుణ్ణి.. అని విర్రవీగుతున్న మనిషి నడ్డిని విరిచేసింది ఈ కరోనా మహాతల్లి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా చావులను చూసుకున్నట్లైతే... మన మనసు చలించక మానదు. అయినను ఆ కరోనాకు కరుణ రావట్లేదుకదా... మరి పెచ్చుమీరి ప్రబలుతోంది... ఒక్క దేశంతో మొదలైన దాని ప్రయాణం ఇపుడు ప్రపంచ దేశాలను కమ్మేసింది.

 

అత్యధికంగా.. అగ్రదేశం అమెరికాను టార్గెట్ చేసింది. అన్ని దేశాలకు, మేమే రాజులం అని భావించిన పెద్దన్నను... ఒక్క వేటుతో, కుదేలు చేసింది ఈ కరోనా. ఇక దాని తరువాత ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా వున్నాయి... టెక్నాలజీలో మాకు ఎదురు లేదు అనుకొన్న దేశాలను వణికిస్తోంది ఈ మహమ్మారి కరోనా వైరస్. మరణాల సంఖ్యలో మాత్రం అన్నింటి కంటే, ఇటలీనే ఇపుడు అగ్రస్థానంలో ఉంది.

 

ఇకపోతే.. స్పెయిన్ లో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ.. మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో స్పెయిన్ వాసులు ఒకింత ఊరట చెందారు. కరోనా కారణంగా ఇప్పటివరకు అమెరికాలో 277522 కేసులు నమోదు కాగా.. 7406 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్ లో గాని చూసుకుంటే, 124736 కేసులు నమోదు అవ్వగా.. 11744 మంది ప్రాణాలు విడిచారు.. ఇక మొత్తంగా కానీ చూసుకుంటే...
 

ప్రపంచలో మొత్తం కేసులు: 11, 30, 576
మరణాలు: 60, 128
రికవరీ కేసులు: 2, 35, 880

 

ఇండియాలో మొత్తం కేసులు: 3082 
మరణాలు: 86 
కొత్త కేసులు: 23
రికవరీ కేసులు: 229 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 229
యాక్టివ్ కేసులు: 103
మృతులు: 11 
ఏపీలో మొత్తం కేసులు: 180
మృతులు: 1

 

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
నెల్లూరు: 32
కృష్ణా: 27
గుంటూరు: 23
కడప: 23
ప్రకాశం: 18 
పశ్చిమ గోదావరి: 15
విశాఖపట్నం: 15
తూర్పు గోదావరి: 11  
చిత్తూరు: 10 
అనంతపురం: 2 
కర్నూలు: 4 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: