ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తేసే అవకాశాలు ఉన్నాయని చాలా మంది ఆశాలుపెట్టుకున్నారు. కాని అది నిజం కాదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. లాక్ డౌన్ ని కేంద్రం పొడిగించే అవకాశం లేదు గాని ఒక్కసారే ఎత్తేసే ఆలోచన మాత్రం కేంద్రానికి లేదు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కేంద్రానికి ఇప్పుడు కేసులు పెరగడం మాత్రం తల నొప్పిగా మారిన అంశం అని కాబట్టి ఒక్కసారే లాక్ డౌన్ ని ఎత్తివేసి ప్రజలను రోడ్డు మీదకు పంపే ఆలోచన కేంద్రం చేసే అవకాశం ఉండదు అంటున్నారు. లాక్ డౌన్ ని అమలు చేయడమే మంచిది అనేది కూడా కేంద్రం ఆలోచిస్తుంది. 

 

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్ళను గత నాలుగు రోజుల నుంచి పట్టుకునే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. వాళ్ళు ఎవరికి అంటించారు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళ నుంచి బయటకు రావడానికి 14 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ ని ఎత్తివేస్తే మాత్రం ఇబ్బందులు రావడం ఖాయమని అంటున్నారు. ముందు జిల్లాల మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ ని ఒక్కసారే ఎత్తేస్తే పరిస్థితి ఇబ్బందికరంగా మారడం ఖాయమని అంటున్నారు. 

 

లాక్ డౌన్ ని అమలు చేసినా సరే అది కొన్ని జిల్లాలకు పరిమితం అవుతుంది అంటున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా వైరస్ చెలరేగిపోతుంది. ఈ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల లోను కరోనా వైరస్ ఉంది. కాబట్టి ఇది కట్టడి కావాలి అంటే లాక్ డౌన్ అమలు చేయడం మినహా మరో మార్గం లేదు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే లాక్ డౌన్ ని సడలిస్తారు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: