ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ మీద తీవ్రంగా పోరాటాలు చేస్తున్నారు. దాదాపు అన్ని దేశాలు కూడా కరోనా వైరస్ బారిన పడి చుక్కలు చూస్తున్నాయి. తమ పౌరులను ఏ విధంగా కాపాడుకోవాలో అర్ధం కాక ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక వైద్య సిబ్బందికి అందించే పరికరాల విషయంలో ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి ప్రపంచ దేశాలు అన్నీ కూడా. వైద్య సిబ్బంది కి అందించే పరికరాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరికి వారు సూచనలు చేస్తున్నారు. అన్ని దేశాలు కూడా ఇప్పుడు అదే చేస్తున్నాయి. 

 

అయితే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కరోనా వైరస్ విషయంలో ఐక్యత చాటితే కరోనా తగ్గుతుంది అంటున్నారు. జనతా కర్ఫ్యూ విషయంలో మోడీ చెప్పింది అందరూ చేసారు. అదే రోజు సాయంత్రం ఆయన చెప్పినట్టు చప్పట్లు కొట్టారు. అన్నం తినే పళ్ళెం గట్టిగా కొట్టారు. ఇప్పుడు ఆయన చెప్తున్న కొవ్వొత్తులు ఎందుకో ఎవరికి అర్ధం కావడం లేదు. దాని గురించి మాట్లాడే వాళ్ళు అందరూ ఆగమ శాస్త్రాలు చెప్తున్నారు. కరోన తగ్గాలి అంటే లైట్స్ ఆగితే అన్ని దేశాలు అదే చేస్తాయి కదా అని అంటున్నారు. 

 

ఇప్పుడు అందరూ సామాజిక దూరం పాటిస్తున్నారు. ఆ దీపాలు వెలిగించడానికి అందరూ మళ్ళీ దగ్గరగా జరిగే అవకాశం ఉంటుంది. దాని వలన కలిగే ప్రయోజనం ఏంటీ అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరికరాలను అందించాలి గాని ఇలాంటివి ఎందుకు అంటున్నారు. అమెరికాలో ఆ తెలివి ఎవరికి లేక కరోనాను పోషిస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు మోడీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీని వలన హడావుడి మినహా... ఏమీ లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనిని పాటిస్తే వచ్చే ప్రయోజనం ఏంటో మోడీ చెప్పాలని విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: