ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ శ‌ర వేగంగా విస్తున్న‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి దేశ‌దేశాలు లాక్‌డౌన్ విధించాయి.  దీంతో అత్యవసర సేవలు మినహా అన్నీ బందయ్యాయి. బార్లు, వైన్స్‌లు సైతం బంద్ కావడంతో మందుబాబులు గంతులో చుక్క ప‌డ‌క‌ విలవిలలాడిపోతున్నారు.  ఇక కొందరు మందుబాబులు మద్యం లేక పోవడంతో పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మద్యానికి బానిసైన వారు మద్యం దొరకక కుంగుబాటుకు గురై ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి చేరుతున్నారు. 

 

వీరంతా వారం రోజులుగా మద్యం దొరకక కుంగుబాటుకు గురైనవారే కావ‌డం గ‌మ‌నార్హం. వీరికి మద్యం దొరకక పోవడంవల్లే వింతవింతగా ప్రవర్తిస్తున్నారని వైద్యులు నిర్ధారిస్తున్నారు.  అలాగే చాలామంది ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తమిళనాడులో మద్యం దొరక్కపోవడంతో కూల్ డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుకుని ముగ్గురు యువకులు తాగేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కొట్టైపట్టినమ్‌కు చెందిన ముగ్గురు మృత్స్యకార యువకులు ఎం.హసన్ మైదీన్, ఎం.అరుణ్ కుంతియాన్, పి.అన్వర్ రాజా లు మందుకు బానిస‌గా మారారు.

 

అయితే లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ద్యం దొర‌క‌క‌పోవ‌డంతో గ‌త కొన్ని రోజులుగా స‌త‌మ‌త‌మ‌వుతూ వ‌స్తున్నాయి. కూల్ డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుకుని తాగితే మత్తు ఎక్కుతుందని ఎవరో చెప్ప‌డంతో.. శుక్రవారం రాత్రి ముగ్గురు కూల్ డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుని తాగారు. తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటికే మైదీన్, అరుణ్ వాంతులు చేసుకుంటుండడంతో కుటుంబస‌భ్య‌లు వారిని వెంట‌నే హాస్ప‌ట‌ల్‌కి తరలించారు. కాని, ఫ‌లితం లేక‌పోయింది. వారిద్ద‌రూ మృతి చెందారు. ఇక ఇదే క్ర‌మంలోనే అస్వస్థతకు గురైన అన్వర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అన్వర్ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: