అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదొక టైపు. ఎడ్డెం అంటే తెడ్డెం అనడం ఆయనకు ఉన్న ఒక మంచి అలవాటు. అతను మాట్లాడే మాటలు మరియు చేసే పనులు తరుచూ వివాదాస్పదం అవుతుంటాయి. అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షుడు అయినా కూడా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడం లో పూర్తిగా విఫలమయ్యాడు అన్నది అక్షర సత్యం. ఇప్పటికే దేశంలో రెండు లక్షల మందికి పైగా ప్రజలు వైరస్ బారినపడగా.... 7వేల మంది మరణించారు దేశ ఆర్థిక పరిస్థితి ఏమైపోతుందో అని లాక్ డౌన్ ప్రకటించకుండా ప్రజల ప్రాణాలను రిస్క్ లో పడేశాడు అని అందరూ అతని పై దుమ్మెత్తి పోస్తున్నారు.

 

ఒక రకంగా కరోనా విషయం పై చేతులెత్తేసిన ట్రంప్ మరికొద్ది రోజుల్లో ఒక పెద్ద మారణకాండను దేశ ప్రజలు చూసి తీరాల్సిందే అని వారిని ఇప్పటినుండే మానసికంగా సిద్ధం చేస్తున్నాడు కూడా. ఇదే క్రమంలో ఆయన దేశ ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి అని కోరిన ఆయన కేవలం మెడికల్ మాస్క్ లను మాత్రమే వాడాల్సిన అవసరం లేదని సాధారణ మాస్కులు, చేతి రుమళ్ళు ధరించి సరిపోతుందని అన్నారు.

 

ఏదో పెద్ద కనిపెట్టినట్టు అమెరికా అధ్యక్షుడు చిన్న విషయాన్ని స్వయంగా చెప్పాల్సిన అవసరం దేనికి అని అందరి మదిలో ఒక ప్రశ్న ఉండగా అంత పెద్ద సలహా ఇచ్చి అయినా తాను మాత్రం ముఖానికి మాస్కు ధరించి ప్రసక్తే లేదని చెప్పడం ఇక్కడ అసలైన ట్విస్ట్.

 

తాను మాస్కు ఎందుకు ధరించటం లేదన్న విషయానికి వివరణ ఇచ్చే కన్నా మాస్కు ధరించనన్న వాదనను వినిపించటం ద్వారా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేశారు. దేశాధ్యక్ష స్థానంలో ఉన్న వారు అందరికి మార్గదర్శకంగా నిలవాలి. ఎప్పుడూ తాను చెప్పినట్లు ప్రజలు పాటించాలని భావించే ట్రంప్.. తాను మాత్రం అలాంటివేమీ చేయనని చెప్పటంలో అర్థమేమిటి? ఇలాంటివేళలో మొండితనం ఏమిటో?

మరింత సమాచారం తెలుసుకోండి: