ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా వైరస్ పట్టి పీడిస్తుంది.  ఎక్కడ చూసినా కరోనా కరాళ నృత్యం చేస్తుంది. కరోనా కల్లోలంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో రోగులు వచ్చి చేరుతున్నారు.  ఇప్పటివరకు 205 దేశాలకు విస్తరించింది. 11.18 లక్షల మందికి కొవిడ్‌-19 వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 59,200 మందికి పైగా కరోనా బాధితులు చనిపోయారు. ఇప్పటివరకు 2.29 లక్షల మంది కోలుకున్నారు. అమెరికాలో ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. అదే స్థాయిలో  మరణాలు జరుగుతున్నాయి.

 

కేవలం 24 గంటల్లోనే 1480 మంది మరణించారు. కొత్తగా 32 వేల మంది ఆస్పత్రుల్లో చేరారు. జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ కరోనా రోగుల సంఖ్య 2 లక్షల 77 వేల 467 కు చేరింది. 7,402 మంది ఈ మహమ్మారికి బలి అయ్యారు.  అమెరికాలోని న్యూయార్క్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్ కారణంగా  ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతుండడంతో మృతదేహాల ఖననానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక, న్యూయార్క్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి.

 

నగరంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటిపోగా, 3 వేల మందికిపైగా మృతి చెందారు. మరణాల సంఖ్య పెరుగుతుండడంతో శ్మశానవాటికల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. . ఖననం చేసే వీలు లేకపోవడంతో మృతదేహాలపై లేపనాలు పూసి ఏసీల్లో భద్రపరిచినట్టు బ్రూక్లిన్ శ్మశానవాటిక నిర్వాహకులు తెలిపారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: