కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ముందుగా విదేశీయులను కట్టడి చేయడంలో వాళ్ల ద్వారా ఇతరులకు కరోనా వైరస్ సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని పగడ్బందీగా వ్యవహరించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ అనుసరించిన విధానం జాతీయ స్థాయిలో కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు కలిగిన రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి గా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒకపక్క సంక్షేమాన్ని మరోపక్క అభివృద్ధిని తనదైన శైలిలో చేసుకుంటూ పోతున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎంత కష్టపడుతున్నా గానీ తన వాళ్ళు చేస్తున్న చేష్టలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. అదేమిటంటే ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో వై.ఎస్.జగన్ విఫలమయ్యారని చేస్తున్న వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు అతిగా స్పందిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. మీడియా కి అసలు వైయస్ జగన్ సమాధానం చెప్పటం లేదని అంటున్న తరుణంలో...అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా ఎవరు కోసం పని చేస్తుందో అందరికీ తెలుసు అంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారట.

 

అధికారంలో ఉన్న వైఎస్ జగన్, మీడియా విషయంలో వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న కామెంట్లను ఖండించాలని కంట్రోల్ చేయాలి అంటూ చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే టైములో వైసిపి కార్యకర్తలు మోడీ వీడియోల రూపంలోనే ప్రసంగిస్తున్నారు ఎక్కడ కూడా మీడియానే ఎదుర్కొన్న లేదు ...వైరస్ కట్టడి చేయడం ముఖ్యం అంతేగాని మీడియాతో మాట్లాడాలి అని రూల్ ఎక్కడా లేదని వైసిపి కార్యకర్తలు అతిగా వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: