ప్రపంచాన్ని మొత్తం కంటిమీద కునుకు లేకుండా పట్టి పీడిస్తుంది కరోనా భూతం.  ఒక్కరు కాదు.. వేలల్లో మరణాలు.. లక్షల్లో బాధితులు నమోదు అవుతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య కరోనా బాధితులు పెరిగిపోతున్నారు.  తాజాగా ఏపి సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు.  దేశంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తుంది.. ఈ నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ.. ఇంట్లో పదిలంగా ఉండాలని అన్నారు సీఎం జగన్.  లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించొద్దు.. భౌతిక దూరం పాటిస్తూ.. కరోనాపై యుద్దం చేద్దాం అన్నారు.

 

ఢిల్లీలో జరిగిన ఒక సమావేశానికి అనేక దేశఆల నుంచి ప్రజా ప్రతినిధులు వచ్చారు. కొందరు విదేశీ ప్రతినిధులకు ఈ కరోనా ఉండటంతో మన దేశంలో ప్రతినిధులకు ఆ వైరస్ సోకిందని అన్నారు.  మన దేశంలో కూడా అనేక మంది ఆద్యాత్మిక వేత్తలు ఉన్నారని అన్నారు. ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో అయినా ఇలాంటివి జరగొచ్చు.. జరిగిన సంఘటనను దురదృష్టకరంగా చూడాలి.  ఏ ఒక్కరికో దాన్ని ఆపాదించవంద్దు అన్నారు సీఎం జగన్.  ఈ సమయంలోనే భారతీయులంతా ఒక్కటిగా ఉండాలని అన్నారు.

 

కరోనా కాటుకు కుల, మత, ప్రాంత బేధాలు లేవు.. చిన్నా పెద్దా అనే తారతమ్యాలు లేవు అన్నారు.  రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగిద్దాం.. ప్రతి ఒక్కరూ దీపాలు, క్యాండిల్స్, టార్చిలైట్, సెల్ ఫోన్ టైల్ వెలిగించాలని.. ప్రధాని మోదీ కూడా మనం దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.  సంఘీభావాన్ని చాటుదాం అన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: