ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే తాజాగా ఇటీవల సోషల్ మీడియాలో లాక్ డౌన్ జూన్ నెల వరకు కంటిన్యూ అవుతుందని వార్తలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వస్తున్న వార్తలను కొట్టి పారేసిన ఈ సంగతి అందరికీ తెలిసినదే. మరికొద్ది రోజుల్లో లాక్ డౌన్ దశలవారీగా ఎత్తివేసేందుకు రెడీ అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల క్లారిటీ ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు ఇచ్చిన రిపోర్ట్ కలకలం రేపుతుంది. జూన్ నెల వరకూ భారత్ లో లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశముందని ఆ నివేదికలో పేర్కొనటం దేశంలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

గత నెల 22వ తారీకు నుండి కేంద్ర ప్రభుత్వం భారత్ లో లాక్ డౌన్ వచ్చింది. దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ప్రజలను బయటకు రాకుండా పగడ్బందీగా పోలీసులు పహారా పెట్టి  ఇంటికి పరిమితం చేశారు. దీంతో చాలా వరకు పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. పనులు లేక పోవటం జీతాలు రాకపోవడంతో అనేక మంది ఆకలి కష్టాలు ఎదుర్కొంటున్నారు.

 

ఇటువంటి టైం లో అతి తక్కువ భాగం మరియు ఎక్కువ మంది జనాభా కలిగిన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం కావడంతో ఏ మాత్రం వైరస్ ప్రబలిన భారత్ లో లక్షల్లో మృతులు ఉంటారని...అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. దీంతో ప్రధాని మోడీ గట్టి కారణం చూపి...దేశ ప్రజలందరికీ వచ్చే జూన్ నెల వరకు క్లోజ్ చేసే అవకాశం ఉందని తాజాగా సరికొత్త వార్తలు వినబడుతున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: