ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కరోనా బాధితుల మీద ప్రజలు ఆప్యాయత చూపాలని... మన వాళ్లను మనం వేరుగా చూడకూడదని అన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఎవరూ అతిక్రమించవద్దని సూచించారు. కరోనా కాటుకు కులాలు మతాలు లేవని చెప్పారు. ఈ యుద్ధంలో ప్రత్యర్థి మన కంటికి కనిపించడని అన్నారు. 
 
మనుషులుగా కరోనాపై అందరం పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకే పిలుపునిచ్చారని చెప్పారు. 5వ తేదీన రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా దీపాలు వెలిగించాలని సూచించారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒకటే అనే సందేశాన్ని ఇస్తూ దీపాలు వెలగాలని అన్నారు. చీకటి నింపుతున్న కరోనా మీద దివ్వెలు, దిపాలు, టార్చ్ లు, మొబైల్ లైట్ల వెలుగులు నిజమైన వెలుగుకు నిజమైన అర్థం తీసుకురావాలని సూచించారు. 
 
నేడు ఈ టీవీ ఛానెల్ ను చూసినా, సోషల్ మీడియా ఛానల్ ను గమనించినా అందరికీ కూడా కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని చెప్పారు. కరోనా లాంటి వైరస్ వల్ల మనలో మనకు విబేధాలు రాకూడదని అన్నారు. ప్రజలందరూ సహృదయంతో చెప్పే ఈ విజ్ఞప్తిని తీసుకుంటారని... మనం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సందేశం ఇవ్వాలని చెప్పారు. 
 
కరోనా వైరస్ మీద యుద్ధం మెడికల్, హెల్త్ డిపార్టుమెంట్లు, పోలీస్ డిపార్టుమెంట్, శానిటేషన్ డిపార్టువెంటుకు వెంటనే జీతాలు చెల్లిస్తామని చెప్పారు. మిగతా ఉద్యోగులను ఒప్పించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. పోలీస్, మెడికల్, శానిటేషన్ ఉద్యోగులకు కష్టమైనా కూడా జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఇది ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని ప్రజలు ఇంటికే పరిమితమవ్వాలని... సామాజిక దూరం పాటించాలని సీఎం సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: