ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశాల మీద కొన్ని రోజుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కీలక సమయంలో కూడా ఆయన ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇప్పుడు ఏమీ మాట్లాడకపోవడం నిజంగా ఆశ్చర్యం అంటూ పలువురు షాక్ అవుతున్నారు. జగన్ ని ఎంతో అభిమానించే వాళ్ళు కూడా ఈ పరిణామాలు చూసి అయ్యో పాపం అనే పరిస్థితి వచ్చింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. జగన్ మీడియా సమావేశాలు ఇప్పుడు చాలా కీలకం. 

 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఆయన మాట్లాడే వాటిపై పక్క రాష్ట్రం అయిన తెలంగాణా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయినా సరే జగన్ మాత్రం మమ అనిపించే విధంగానే ప్రసంగాలు చేస్తున్నారు. ముందు మీడియా సమావేశాలు అన్నారు. ఆ తర్వాత నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు అంటున్నారు. జగన్ ఇమేజ్ కి ఆయన స్థాయికి ఇది ఎంత మాత్రం సరైన విధానం కాదని అంటున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీడియా ముందుకి వచ్చి ప్రసంగాలు చేస్తున్న తరుణంలో జగన్ ఇలా చేయడం భావ్యం కాదని అంటున్నారు. 

 

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ అంటే ద్వేషం ఉంటుంది. అలాంటి ఏపీలో కరోనా తర్వాత కేసీఆర్ ప్రసంగాలతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ అభిప్రాయం మార్చుకున్నారు చాలా మంది. శనివారం సాయంత్రం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసంగంలో ఎక్కడా కూడా... ఆయన క్వారంటైన్ సెంటర్ల గురించి గాని, ఐసోలేషన్ వార్డుల పెంపు గురించి గాని, వలస కూలీల ఇబ్బందులు గాని, ప్రజలకు చేసే ఆర్ధిక సాయం గురించి గాని, టెస్టింగ్ ల్యాబుల గురించి గాని ఎక్కడా ఏ మాటా మాట్లాడలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే... ఆయన ఎం మాట్లాడుతున్నారు అనేది టీవీ సౌండ్ పెంచేలోపు, యుట్యూబ్ లోడ్ అయ్యే లోపు ప్రసంగం అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: