ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తోంది. శ‌నివారం సాయంత్రం కొత్త‌గా రాష్ట్రంలో మ‌రో 10 కేసులు రావ‌డంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య ఏకంగా 190కు చేరుకుంది. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో అత్య‌ధికంగా కృష్ణా జిల్లాలో 32 కేసులు.. నెల్లూరు జిల్లాలో 32 కేసులు న‌మోదు అయ్యాయి. వాస్త‌వానికి నెల్లూరు జిల్లాలో నిన్న‌టికే 32 కేసులు ఉండ‌గా.. ఇప్పుడు కొత్త కేసులు క‌లుపుకుంటే కృష్ణా జిల్లాలో సైతం 32 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక వైజాగ్‌తో పాటు గుంటూరు, ప్ర‌కాశం, ప‌శ్చిమ గోదావ‌రి, తూర్పు గోదావ‌రి జిల్లాల్లో కేసులు స్వైర‌విహారం చేస్తున్నాయి.

 

ఇక సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో సైతం 23 కేసులు న‌మోదు అయ్యాయి. ఓవ‌రాల్‌గా చూస్తే రాష్ట్రంలో క‌రోనా కేసులు గంట గంట‌కు పెరిగిపోతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో క‌రోనా కొత్త కేసులు న‌మోదు కాగా... ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సైతం కొత్త కేసులు న‌మోదు అవుతుండ‌డంతో రాజ‌ధాని ఏరియాల్లో క‌రోనా భ‌యం ఎక్కువ మందిని వెంటాడుతోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: