ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా పేరు చెబితే వణికిపోతున్నారు.  ఎప్పుడు ఎవరికి వచ్చి పడుతుంతో ఈ పీడ అంటూ ఇంట్లోనే గడిపేస్తున్నారు.  అయితే కరోనా వైరస్ కరెన్సీతో కూడా వ్యాప్తి చెందుతోందని చైనాలో పాతనోట్లను రోడ్లమీద వృధాగా పారేసి.. కొత్త నోట్లను ముద్రించారు.  అలాగే ఇటలీలో కూడా అదే పరిస్థితి నెెలకొంది. రోడ్డు మీద చిత్తుకాగితాల మాదిరి కరెన్సీ పడిఉంది. అయినా ఎవ్వరూ వాటిని ముట్టుకునే సాహసం చేయలేదు.  అంతాగా భయపెడుతున్న ఈ కరెన్సీని మన భారత దేశంలో మాత్రం కరెన్సీ విషయంలో ఎవరూ పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం లేదు.  వాస్తవానికి ఇందులో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. ఎందుకంటే కరోనా పాజిటీవ్ ఉన్నవారు ఏదైనా కరెన్సీ నోటును తాకినా.. వాటిపై తుంపర్లు పడ్డా ఇబ్బందే అన్న విషయం గమనించాలి. 

 

ఓ బ్యాంకు ఉద్యోగి అనుసరించిన పద్థతి, చెక్ తీసుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.   బ్యాంకు ఉద్యోగి ఏంచేశాడంటే.. చేతికి గ్లౌజులు, నోటికి మాస్క్ వేసుకుని తన క్యాబిన్‌లో కూర్చున్నాడు. అప్పుడే ఓ వినియోగదారుడు వచ్చాడు. అతని నుంచి, చెక్కును ప్లకర్‌తో అందుకుని, దానిని పక్కనే సిద్ధంగా ఉంచుకున్న ఐరన్ బాక్స్‌తో ఇస్త్రీ చేసి మరీ తీసుకున్నాడు.

 

ఇస్త్రీ వేడికి కరోనా చచ్చిపోతుందని ఆయన ఆ జాగ్రత్త పాటించాడు. అయితే ఇలా చేయడం వల్ల కరోనాను అడ్డుకునేందుకు ఎంతవరకు పనికి వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. కరోనా కరెన్సీ నుంచే కాకుండా వార్తా పత్రికలు, పాల ప్యాకెట్లతో కూడా వ్యాపిస్తుంది అని వైద్యులు అంటున్న విషయం తెలిసిందే. ముందు ముందు వారు ఎలాంటి జగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: