కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలో వచ్చిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు నుండి కోత విధించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ పోలీసులు, వైద్య, ఆరోగ్య సిబ్బందితో పాటు పారిశుద్ధ్య సిబ్బందికి కూడా పూర్తి జీతాలు ఇవ్వాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత శనివారం ఉదయం సమీక్ష నిర్వహించిన జగన్ అధికారులను ఇదే విషయమై ఆదేశించారు.

 

ముందు డాక్టర్లు మరియు పోలీసులకు మాత్రమే పూర్తి జీతాలు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుల తో పాటు డిపార్ట్మెంటు కి సంబంధించిన మొత్తం సిబ్బందికి పూర్తి జీతాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి నుండి ఉద్యోగుల జీతాల విషయంలో జగన్ పూర్తిస్థాయిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఫాలో అవుతూనే ఉన్నారు. నిజానికి కేసీఆర్ ఉద్యోగుల జీతాలలో కోత విధించాలని మార్చి 30 నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే ఏపీలో శాలరీ బిల్ ప్రాసెస్ అయిపోయింది. అయితే జగన్ కెసిఆర్ నిర్ణయం తీసుకున్న వెంటనే బిల్లులు నిలుపుదల చేసి ఉద్యోగులకు జీతాలలో కోత విధించారు.

 

ఇప్పుడు తాజాగా కేసీఆర్ సంక్షోభ సమయంలో ఎక్కువగా కష్టపడుతున్న పారిశుద్ధ్య సిబ్బంది వారి వినతిని కూడా విని వారికి జీతం కోత విధించడం సరికాదని నిర్ణయం తీసుకున్న వెంటనే జగన్ కెసిఆర్ చేసినట్లే వాళ్లకి పూర్తి జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే కెసిఆర్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా చెల్లించాలని నిర్ణయించిన జగన్ ఇప్పటివరకు అలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.  దీనిపై కూడా జగన్ ఒక నిర్ణయం త్వరలోనే తీసుకుంటారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: