ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ పరిధిలోకి కేంద్రం కరోనా చికిత్స, పరీక్షలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులలో కరోనా పరీక్షలు ఉచితంగానే చేస్తున్నారనే విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల 50 కోట్ల మంది కరోనా పరీక్షలను ఉచితంగా చేయించుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. 
 
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రైవేట్ ల్యాబ్ లలో కూడా కరోనా పరీక్షలు ఉచితంగానే జరగనున్నాయి. ప్రధాని సూచనల మేరకు నేషనల్ హెల్త్ అథారిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మోదీ కరోనా చికిత్స, పరీక్షలను ఆయుష్మాన్ భారత్ కింద తీసుకురావడం గురించి స్పందిస్తూ ప్రైవేట్ రంగానికి సంబంధించిన నిర్ణయాలు కూడా వేగంగా తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. 
 
దీని వల్ల ప్రైవేట్ రంగ భాగస్వామ్యం పెరుగుతుందని... దేశంలోని ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా కరోనా చికిత్స, పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దేశంలోని ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్ లు మాత్రమే కరోనా పరీక్షలను చేయాల్సి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రైవేట్ ల్యాబ్స్ కరోనా పరీక్షలు చేయడానికి అనుమతులు లేవు. 
 
నేషనల్ హెల్త్ అథారిటీ దేశంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం తీసుకోవడం వల్ల కరోనా బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని భావిస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఆస్పత్రులను కరోనా ఆస్పత్రులుగా మార్చే వీలు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWN

 

మరింత సమాచారం తెలుసుకోండి: