కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ పెట్టడం వల్ల మందుబాబులకు నానా కష్టాలు వచ్చి పడ్డాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఎమర్జన్సీ సేవలు మినహా మిగతా అన్ని సేవలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బార్లు, వైన్స్ కూడా మూతపడ్డాయి. దీంతో మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రోజూ చుక్క వేయనిదే ఉండలేనివారికి నరకం కనపడుతుంది.

 

ఇక డైలీ మందు అలవాటు ఉన్నవాళ్లు మానసికంగా ఇబ్బందులు పడుతూ, పిచ్చిగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఇలా పిచ్చిగా ప్రవర్తించే వారితో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఫుల్ అయిపోతుంది. అయితే మందు దొరక్కపోవడంతో, మందుబాబులు కొత్త దారులు వెతుకుంటున్నారు. కొందరు అందుబాటులో ఉన్న చోట్ల కల్లు తాగుతున్నారు.

 

అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా నాటు సారా తయారీ కూడా పెరిగింది. దీంతో ఎక్కువ శాతం మందుబాబులు మద్యం దొరక్కపోవడంతో, నాటు సారాయి తాగుతున్నారు. ఇక మరికొందరు అయితే ఏదోకవిధంగా అయిన ఎక్కువ రేటు పెట్టైనా సరే మద్యాన్ని బ్లాక్ లో కొనుక్కుంటున్నారు.

 

ఇంకొందరైతే మరి తెగించేస్తున్నారు. మద్యం కోసం దొంగతనాలు చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో మద్యం షాపులు మూతపడి ఉన్నాయి. షాపులు మూతపడి ఉన్నా, లోపల మద్యం స్టాక్ ఉంది. దీంతో రాత్రి సమయాల్లో మందుబాబులు, స్కెచ్ వేసి మరీ షాపులు బద్దలుకొట్టేసి మద్యం ఎత్తుకుపోతున్నారు. వీలుని బట్టి షాపులో ఉన్నా, డబ్బులని కూడా పట్టుకుపోతున్న ఘటనలు కూడా తాజాగా జరిగాయి.

 

తాజాగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగానే జరుగుతున్నాయి. మందుబాబులు స్కెచ్ వేసుకుని, మద్యం షాపుల్లో చొరబడి బాటిళ్లు ఎత్తుకుపోతున్నారు. ఇక ఈ దొంగతనం పక్కన పడితే, కొందరు మద్యం సొంతంగా తయారీ చేసే కార్యక్రమాలు చేసి, అవి వికటించి మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే మందుబాబులు మద్యం కోసం ఎంతకైనా తెగించేస్తున్నారు. ఎలాంటి దారుల్లోనైనా వెళ్లిపోతున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: