కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు, దేశమంతా లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లాక్ డౌన్ మొదలయ్యి 14 రోజులు కాగా, మరో 10 రోజుల్లో లాక్ డౌన్ ముగియనుంది. అయితే కరోనాపై పోరాటంలో భాగంగా 130 కోట్ల మంది ప్రజల ఐక్యతను చాటేందుకు ప్రధాని మోదీ  చీకటి నుంచి వెలుగువైపునకు పయనించేందుకు ఏప్రిల్ 5, ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాలపాటు దేశ వ్యాప్తంగా లైట్లు ఆపివేసి చేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ లైట్లు, టార్చ్ లను వెలిగించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

 

ఇక ప్రధాని నిర్ణయం దేశం వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్దిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు ఎక్కువగా ప్రతిపక్ష నేతలే. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ప్రధాని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లైట్లు ఆర్పేయడం వల్ల ఏంవస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. కమల్ హాసన్, ఒవైసీ, శశి థరూర్ లాంటి వారు సైతం, ఈ లైట్లు ఆపడం మీద ఫోకస్ చేసే బదులు, పేదల కష్టాలు ఎలా తీర్చాలనే దానిపైన దృష్టిపెడితే బాగుంటుందని అంటున్నారు.

 

ఇక మరికొందరైతే ఒక్కసారిగా లైట్లు ఆపేసి, ఒక్కసారిగా ఆన్ చేయడం  వల్ల పవర్ గ్రిడ్ కుప్పకూలే అవకాశముందని చెబుతున్నారు. అయితే ప్రతిపక్ష నేతలు ఈ రేంజ్ లో పీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించడం వెనుక కారణం లేకపోలేదు. ఈ కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రధాని గట్టిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే జనతా కర్ఫ్యూ ద్వారా దేశాన్ని యూనిటీ చేయడంలో సక్సెస్ అయ్యారు.

 

ఇప్పుడు ఈ ఆదివారం చేసే కార్యక్రమంతో భారతీయలు ఐక్యత మరొకసారి తెలుస్తోంది. పైగా దీని వల్ల ఎలాంటి విద్యుత్ సమస్యలు కూడా రావని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా దేశం మొత్తం ఐక్యత వచ్చేలా చేయడంతో మోదీ రేంజ్ మరింత పెరగనుంది. ఇక దీని వల్ల మోదీకి మరింత పొలిటికల్ మైలేజ్ పెరిగే అవకాశముందని ప్రతిపక్ష నేతలకు భయం పెరిగిపోయినట్లు తెలుస్తోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: