అసలే కరోనా.. ఎవరిని నమ్మాలో, నమ్మకూడదో తెలియని పరిస్దితులు.. ఇలాంటి సమయంలో ఎవరైనా సహాయం చేస్తా అంటే గుడ్దిగా నమ్మడం మూర్ఖత్వం అవుతుంది.. ఇదే విషయాన్ని చైనా నిరూపించింది.. ఇక అందరికి తెలిసిన విషయం ఏంటంటే చైనా, పాకిస్దాన్‌లు ఎంత జిగిరి దోస్తులో.. చెడ్డీ దోస్తులు కూడా అంత కలసి కట్టుగా ఉండరు..

 

 

అయితే కరోనా విపత్తు పాకిస్దాన్‌ను కూడా వెంటాడుతుంది.. దీనికంటే ముందే పాకిస్దాకు కరోనా విషయంలో అండగా ఉంటామని హామి ఇచ్చిందట చైనా.. తాను చెప్పినట్టే ఒక్క రోజు సరిహద్దులు తెరిస్తే వైద్య పరికరాలను పంపిస్తామని పేర్కొనగా.. చైనా మాటలు నమ్మిన పాక్.. సరిహద్దులు తెరిచింది. ఇక చైనా తన వంతుగా పాకిస్దాన్‌కు 2లక్షల సాధారణ మాస్కులు, 2వేల ఎన్‌ 95 మాస్కులు, 5 వెంటిలేటర్లు, 2వేల కరోనా టెస్టింగ్ కిట్లు, డాక్టర్లు వేసుకోవడానికి 2వేల మెడికల్ సూట్లు పంపించింది.

 

 

చైనా చేసిన సహాయానికి పొంగిపోయిన పాకిస్దాన్ బలగాలు సింధ్ ప్రావిన్స్‌లో వాటిని సరిగా పరీక్షించకుండానే ఆస్పత్రులకు సరఫరా చేసేశాయి. ఇంత వరకు అంతా బాగానే ఉంది.. కానీ అసలు విషయం ఏంటంటే చైనా పంపిన బాక్సుల్లో, "లో" దుస్తులతో చేసిన మాస్కులు కనిపించాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఖంగుతిన్నారు. వారేవా చైనా పాకిస్దాన్‌కు చేసిన సహాయం జీవితంలో మరవలేమనుకున్న అధికారులకు చైనా దెబ్బ బాగా రుచిగా తగిలినట్టు అయ్యింది.. దాంతో ఈ ఘటన పాక్‌లో కలకలం రేపింది.

 

 

ఇకపోతే చైనా చేసిన సహాయానికి టీవీ ఛానెళ్లలో కూడా చర్చించుకున్నారు. ఇక ఈ విషయంలో ఇరుదేశాల ప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి.. అసలే కరోనా ఈ టైంలో పాక్ సహాయం కోరడం.. చైనా పంపడం నిజంగా ఇదోక చార్లిన్ ఛాప్లిన్ కధలా ఉందని నెటిజన్స్ అనుకుంటున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: