ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి రోజు రోజు కీ పెరిగిపోతూనే ఉంది.  దేశంలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంతో ముడిపడినవే ఉన్నాయి.  గత నెల  ఢిల్లీ నుంచి తమ రాష్ట్రాలకు చేరుకున్న మర్కజ్ యాత్రికుల ద్వారా కరోనా వ్యాప్తి విస్తృతమైంది. అయితే వీరు ఎక్కడెక్కడ ఉన్నారు.. ఎక్కడికి వెళ్లారు అన్న ప్రశ్నలు ఇంకా సవాల్ గానే ఉన్నాయి. 

 

కొంత మంది స్వచ్ఛందంగా వస్తే మరికొంత మంది మాత్రం ఇప్పటికీ వెలుగు లోకి రాలేదు. మొదట ఓ మోస్తరు కేసులతో బయటపడొచ్చని భావించిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒకట్రెండు రోజుల వ్యవధిలో భారీగా పాజిటివ్ కేసులు రావడంతో వెంటనే అప్రమత్తం అయ్యాయి. కరోనా పరీక్షలు చేయించుకోవడానికి మర్కజ్ యాత్రికులు నిరాకరిస్తున్న నేపథ్యంలో, సీఎం కేసీఆర్ స్పందించారు.

 

ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్ లోకి వెళ్లాలని సూచించారు.  మేరకు సీఎం కేసీఆర్ మతపెద్దలతో ఫోన్ లో మాట్లాడారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. రోజుకు మూడు షిఫ్ట్ లు పనిచేసి మర్కజ్ యాత్రికుల్లో ఎవరు కరోనా పాజిటివ్, ఎవరు నెగెటివ్ అనేది తేల్చాలని సర్కారు కృతనిశ్చయంతో వుంది.  ఈ కరోనా ఎఫెక్ట్ ఏపిలో రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటికే 180 కేసులు నమోదు అయ్యాయి. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: