ప్ర‌పంచ దేశాల్లో ఉత్త‌ర కొరియా తీరే వేరు. నియంత కిమ్‌జాంగ్ పాల‌న‌లో కొన‌సాగుతున్న ఈ దేశంలో పౌర‌హ‌క్కుల గురించ ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత మంచిది. త‌న క్షిప‌ణి బెదిరింపుల‌తో అగ్ర‌రాజ్యం అమెరికాకు వెన్నులో వ‌ణుకుపుట్టించిన ఘ‌నుడు..క్రూరుడు.కిమ్‌జాంగ్. అయితే ఈ దేశం ఆర్థిక ప‌రిస్థితి అంతత మాత్ర‌మే. ఉండదు. ఉత్తర కొరియా అంటే గుర్తొచ్చేవి ఆ దేశ నియంత పాలకుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, క్షిపణి ప్రయోగాలు. అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా కిమ్‌జాంగ్ కింద ప‌నిచేసే కొంత‌మంది అధికారుల చేతుల్లోనే ఉంటాయి. వీళ్ల‌లో కూడా ఎవ‌రైనా తోక జాడిస్తే వాళ్ల‌కు తెలియ‌కుండానే పీక‌లు తెగిపోతాయ్‌. 


 ఇక్క‌డి వ్య‌వ‌స్థ‌లు ఎలా పనిచేస్తాయో సమాచారం. ఇలాంటి దేశంలో క‌రోనాను ఎలా ఎదుర్కొంటున్నారు అనే సందేహాలు ప్ర‌పంచ ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌ను తొలుస్తున్నాయ‌ట‌. అయితే గూగుల్‌లో ఈ విషయంపై శోధించిన వారికి  ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు తెలుస్తున్నాయ‌ట‌. చైనాలో గతేడాది చివర్లోనే నావెల్‌ కరోనా వైరస్‌ విజృంభించింది. ఈ విషయం తెలియగానే కిమ్‌ కఠిన చర్యలకు ఆదేశించార‌ట‌. జనవరి నుంచే దేశ సరిహద్దులను మూసేయించారు. అంతర్జాతీయ విమాన, రైలు ప్రయాణాలను నిషేధించ‌డం గ‌మ‌నార్హం. వాస్తవంగా 90 శాతం ప్రయాణాలన్నీ చైనాకే ఉంటాయి. సరిహద్దుల్లోని విమానాశ్రయాలు, పోర్టులు, రైల్వే స్టేషన్లు బంద్‌ చేయించ‌డంతో క‌రోనా దేశంలోకి ప్ర‌వేశించ‌కుండా నిరోధించ‌గ‌లిగార‌ట‌. 


ఇక విదేశాలకు వెళ్లేందుకు స్థానికులకు అనుమతి నిరాక‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇంత ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించ‌బ‌ట్టే ఇప్పుడు కొరియాకు క‌రోనా ప్ర‌మాదం త‌ప్పింద‌ని కిమ్‌జాంగ్‌ను ఆ దేశ ప్ర‌జ‌లు మెచ్చుకుంటుండం కొస‌మెరుపు. అయితే కొద్దిరోజులు గా ఉత్త‌ర కొరియాలో క‌రోనా వ‌స్తే కాల్చిపారేస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అవ‌న్నీ అవాస్త‌వ‌లేన‌ని తేలిపోయింది. ఎందుకంటే అక్క‌డ ఇంకా క‌రోనా అడుగుపెట్ట‌లేదు క‌నుక‌.ఇప్పటికైతే అక్కడ ఎలాంటి పాజిటివ్‌ కేసులు లేవని ప్రభుత్వ మీడియా చెప్పింది. ముందు జాగ్రత్తగా కఠిన చర్యలు చేపట్టారని వెల్లడించింది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: