ఏపీలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారివేనని ప్రభుత్వం ప్రకటించిన రికార్డులు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. నెల్లూరు, గుంటూరు జిల్లాలలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 
 
నెల్లూరు జిల్లాలో 32 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాలలో భారీగా కేసులు నమోదు కావడంతో ఈ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా కరోనా వేగంగా విజృంభిస్తోంది. కృష్ణా జిల్లాలో 28 కేసులు నమోదు కాగా కడప జిల్లాలో 23, ప్రకాశం జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రంలోని 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా భారీన పడి చికిత్స పొందుతూ ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. 
 
రాష్ట్రంలో నమోదైన 192 కేసుల్లో 170 కేసులు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారివే కావడం గమనార్హం. అధికార యంత్రాంగం కరోనా పాజిటివ్ నమోదైన వారి ఇళ్లను పూర్తిగా అదుపులో ఉంచుకుంది. పాజిటివ్ కేసులు నమోదైన వారితో పాటు వారు కలిసిన వారిని ఐసోలేషన్ లో ఉంచింది. అధికారులు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన 946 మందిని ఇప్పటివరకు గుర్తించారు. వీరితో కాంటాక్ట్ అయిన 1,120 మందిని గుర్తించారు. ఇప్పటివరకు వీరిలో 879 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా రేపు లేదా ఎల్లుండి మిగిలిన వారి నుంచి సేకరించనున్నారు. 

 

రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: