ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నా అది పెరుగుతుందే గాని తగ్గే పరిస్థితిలో ఏ మాత్రం కనపడటం లేదు. గంట గంట కు రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షలు దాటి 13 లక్షల వైపు పయనం చేస్తుంది. 

 

అగ్ర రాజ్యం అమెరికా అయితే కరోనా వైరస్ ధాటికి చిగురుటాకులా వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మూడు వేలు దాటింది కరోనా వైరస్ కేసుల సంఖ్య. 1,201,473 మందికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకింది. వీరిలో 64,691 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 246,437 మందికి వ్యాధి పూర్తిగా నయం అయింది. 890,345 మంది చికిత్స పొందుతున్నారు. 

 

వీరిలో 848,057 (95%) మంది ఆరోగ్యం నిలకడగా ఉండగా 42,288 (5%) మంది ఆరోగ్య పరిస్థితి పూర్తి విషమంగా ఉందని తెలుస్తుంది. అమెరికాలో కరోనా వైరస్ మూడు లక్షల 11 వేలు దాటింది. అక్కడ దాదాపు 9 వేల మంది వరకు కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మన దేశంలోని తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. తెలంగాణాలో 272 కేసులు కాగా ఆంధ్రప్రదేశ్ లో 200 కి చేరువలో ఉంది సంఖ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: