ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ క్రమంగా పెరుగుతుంది. గంట గంటకు కరోనా తన తీవ్రత పెంచుకుంటుంది గాని తగ్గడం లేదు. కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు అన్ని దేశాల మీద గట్టిగా పడింది. మన దేశంతో పాటుగా ప్రపంచంలో అన్ని దేశాలు ఇప్పుడు కరోనా వైరస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఇప్పుడు 13 లక్షలకు వెళ్తున్నాయి. 

 

అగ్ర రాజ్యం అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాలు దీని గుప్పిట్లో ఉన్నాయి. మధ్య ప్రాచ్య దేశాలు కూడా ఇప్పుడు నరకం చూస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,201,476 గా ఉంది. వీరిలో 64,691 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 246,467 మందికి కరోనా పూర్తిగా నయం కాగా 890,318 మంది కరోనా వైరస్ కి చికిత్సను పొందుతూ ఆస్పత్రుల్లో ఉన్నారు. 

 

ఇక వీరిలో 848,030 (95%) మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 42,288 (5%) మంది ఆరోగ్యం విషమంగా ఉంది. అమెరికాలో మూడు లక్షలు దాటగా స్పెయిన్ లో ఇటలీ లో కరోనా వైరస్ కేసులు లక్ష దాటాయి, జర్మని లో కూడా కరోనా కేసులు లక్షకు ఉన్నాయి. ఇటలీ లో కరోనా వైరస్ బారిన పడి 15 వేల మంది మరణించారు. ఇక మన దేశంలో మూడు వేలకు కరోనా మరణాలు రాగా, మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మారుతున్నాయి. తెలంగాణాలో 272 ఆంధ్రప్రదేశ్ లో 190 మందికి కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: