ప్రపంచానికి కరోనా వైరస్ ఇప్పుడు కొత్త పాఠాలు నేర్పిస్తుంది. ప్రపంచం మొత్తం కూడా కరోనా వైరస్ గుప్పిట్లో ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా విషయంలో ప్రజలు ఇంకా చాలా వరకు అలసత్వం గానే ఉన్నారని ప్రజల్లో దీని మీద ఎక్కడా కూడా సీరియస్ నెస్ గాని దాన్ని ఎదుర్కోవాలి అనే పట్టుదల గాని లేదని అంటున్నారు. 

 

మన దేశంలో జనాలకు కరోనా అనేది ఒక కామెడి అవుతుంది అంటున్నారు. కరోనా వైరస్ తీవ్రతను మన దేశం అర్ధం చేసుకోలేకపోతుంది అంటున్నారు. ఇప్పుడు దీని తీవ్రతకు చాలా దేశాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా వైరస్ ఎదుర్కోవడం ఎలాగో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. మన దేశంలో ప్రజలు ఇప్పుడు అనవసరంగా బయటకు వస్తున్నారు. పని ఉన్నా లేకపోయినా సరే ఇష్టం వచ్చినట్టు బయటకు రావడంతో ఇప్పుడు పరిస్థితులు చాలా... 

 

దారుణంగా మారే ప్రమాదం ఉంటుంది అనేది చాలా మంది చెప్పే మాట. మన దేశంలో జనాలకు లాక్ డౌన్ ఎందుకు విధిస్తారు అనేది కూడా స్పష్టత రావడం లేదు. దాని వలన కలిగే పర్యావసానాలు మాత్రం తెలియడం లేదు. అందుకే కరోనా లాక్ డౌన్ ని ఎవరూ లెక్క చేయకుండా రోడ్ల మీదకు వస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు జనం ఇష్టం వచ్చినట్టు చేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: