ప్రపంచవ్యాప్తంగా కరోనా వైర‌స్‌(కోవిడ్‌-19) విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి మరింత తీవ్రమవుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ఇప్ప‌టికే కరోనాకు బలైన వారి సంఖ్య 62 వేలకు చేరువలో ఉండగా.. యూరప్ దేశాల్లోనే 40 వేల మందికిపైగా కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ మ‌హ‌మ్మారి బాధితులు 10 ల‌క్ష‌లు ఎప్పుడూ దాటేసింది. అయితే కరోనా వైరస్ మనుషులకు సోకడానికి గబ్బిలాలే ప్రధాన కారణం అని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గబ్బిలాల నుంచి వైరస్‌లు వస్తున్నాయా లేక వాటి ద్వారా వైరస్‌లు వ్యాపిస్తున్నాయా అన్న దానిపై వివిధ దేశాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. 

 

ఇప్పటికే పుణే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ కూడా గబ్బిలాలు వైరస్‌ల వ్యాప్తిపై పరిశోధనలు నిర్వహిస్తోంది. మ‌రోవైపు రాష్ట్రంలోనూ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు పర్యటించి వివిధ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ పరిశీలనలు జరిపారు. వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు రకాల గబ్బిలాల రక్త, లాలాజల శాంపిల్స్‌ను సేకరించారు. దేశవ్యాప్తంగా గబ్బిలాల రకాల నుంచి సేకరించిన శాంపిళ్లపై పరిశోధనలు నిర్వహించి వాటి ద్వారా ఎలాంటి వైరస్‌ ఎలా వ‌చ్చింది అన్న‌ దానిపై పుణే ఇన్‌స్టిట్యూట్‌లో అధ్యయనం కొన‌సాగుతోంది. 

 

ఇక కరోనా వ్యాప్తికి గబ్బిలాలే కారణమని శాస్త్రీయంగా పరిశోధనలతో ఇంకా నిరూపితం కాకున్నా నిపా వైరస్‌ వ్యాప్తికి గబ్బిలాలే కారణమని పుణే వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధనల్లో తేలింది. అయితే ప్ర‌స్తుతం గబ్బిలాలకు సంబంధించినంత వరకు ఇండియాలో ప‌నెండు రకాల జాతులుండగా, వాటిలో మూడు రకాలు వైరస్‌ల వ్యాప్తికి ప్రమాదకారిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

 

వీటిలో పండ్లను సగం తిని వదిలేశాక ఆ పండ్లను తిన్న పందులు, ఇతర పక్షుల నుంచి, క్రిమికీటకాలు, పశువుల కళేబరాల మాంసం తిన్న గబ్బిలాల నుంచి, జంతువుల రక్తం పీల్చే వ్యాంపెయిర్ బ్యాట్‌ల నుంచి వైరస్‌లు విస్తరించేందుకు అవకాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్టు ప్ర‌రిశోధ‌కులు గుర్తించారు. మ‌రి గబ్బిలాల నుంచే వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని తెలిస్తే.. మ‌హ‌మ్మారి క‌రోనాకు వ్యాక్స్‌న్  కనుక్కోవడం సులువు అవుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google:  https://tinyurl.com/NIHWNgoogle

 

applehttps://tinyurl.com/NIHWNapple

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: