కష్టం వచ్చినపుడు ఆదుకున్న వాడే నిజమైన దేవుడు అంటారు.  ఇప్పుడు ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు కోట్ల మంది కష్టాల్లో ఉన్నారు.  చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకొచ్చిన దిక్కుమాలిన కరోనా వైరస్ ఇప్పుడు 205 దేశాలకు విస్తరించి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మరణాలు సంబవిస్తూనే ఉన్నాయి.   రోజు ఈ కరోనా వార్తలు చూసి జనాలకు కూడా బయటకు రావాలంటే పదిమందిలో నిలబడాలంటే వణికి పోతున్నారు.  మనుషులు సామాజిక దూరం ఉండేలా చేసింది ఈ కరోనా.  భారత్ లో లాక్ డౌన్ ఉన్న విషయం తెలిసిందే. దాంతో ఎంతో మంది ఆకలితో అలమటించే పరిస్థితి ఉంది.

 

రోజు పని చేస్తేనే డబ్బు.. ఆ డబ్బుతో ఆకలి తీర్చుకునేవారికి పనులు లేకు దిక్కుతోచని పరిస్థిది. ఈ సమయంలో సెలబ్రెటీలు ముందుకు వచ్చి వారి తోచిన సహాయం అందిస్తున్నారు.  ఈ నేపథ్యంలో నటి రకూల్ ప్రీత్ సింగ్ తన మంచితనాన్ని చాటుకుంది. న్యూఢిల్లీలోని తన ఇంటికి సమీపంలో ఉన్న మురికివాడలో తిండిలేక సతమతమవుతున్న 250 కుటుంబాలకు రెండు పూటలా భోజనాన్ని అందిస్తోంది. లాక్ డౌన్ ముగిసేంతవరకూ ఈ పేదలకు సాయం చేస్తానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ వ్యాఖ్యానించింది. 

 

అక్కడ కొన్ని ప్రాంతాలు దీనమైన పరిస్థితిలో ఉన్నాయని..  ఆకలితో అలమటిస్తున్నాయని తన తండ్రి గుర్తించారని, వారికి తన ఇంటికి దగ్గర్లో ఆహారాన్ని తయారు చేయించి పంపిస్తున్నానని వెల్లడించింది.  లాక్ డౌన్ ను పొడిగిస్తే, ఈ సదుపాయాన్ని మరిన్ని రోజులు అందిస్తామని, ప్రస్తుతానికి ఈ నెలాఖరు వరకూ ఆహారం అందిస్తామని స్పష్టం చేసింది. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్న వేళ, ప్రతి ఒక్కరూ సాయం చేయాలని సూచించింది.  మనల్ని బాగున్నప్పుడు పొగిడిన వారు.. వారు కష్టాల్లో ఉన్నపుడు కాపాడాల్సిన బాధ్యత మాదే అని అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: