ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో  నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలను మూసివేశారు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా మూడు వారాల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థలో అయోమయ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల్లో విద్యా సంవత్సరం ముగింయబోతున్న తరుణంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తడంతో అటు  ఉపాధ్యాయులతో పాటు ఇటు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల్లో  కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత నెల 19 నుంచి విద్యా సంస్థలు మూతపడగా ఈ నెల 14న లాక్ డౌన్  ముగుస్తుందా లేదా అన్నది కూడా స్పష్టత లేకుండా పోయింది. 

 

 

 మామూలుగా అయితే ప్రతి ఏటా విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉంటే అటు టెన్త్ విద్యార్థుల పరిస్థితి కూడా అయోమయంలో పడిపోయింది. ఇప్పటికే టెన్త్ పరీక్షలు రెండు సార్లు వాయిదా పడ్డాయి. ఒకసారి స్థానిక ఎన్నికల కారణంగా వాయిదా పడితే మరోసారి కరోనా కారణంగా  వాయిదా పడింది. ఏదేమైనా ప్రస్తుతం పరీక్షల విషయంలో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. అయితే ఈ పరీక్షలు వాయిదాపడ్డాయి కానీ ఇప్పటివరకు కొత్త షెడ్యూల్ మాత్రం ప్రకటించలేదు ప్రభుత్వం. 

 

 

 ఒకవైపు పాఠశాలలు బంధు కావడం... మరోవైపు పరీక్షలు వాయిదా పడడంతో ఈ ప్రభావం  విద్యార్థుల పై పడే అవకాశం కూడా ఉంది. అయితే మే నెలాఖరులో పది పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అప్పుడు కూడా పరీక్షలు జరుగుతాయనేది  కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపించేయాలని నిర్ణయించినప్పటికీ పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహణ విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతుంది ప్రభుత్వం. విద్యార్థులు కూడా పది పరీక్షల విషయంలో స్పష్టత లేకపోవడంతో అయోమయం లోనే ఉన్నారు. సాధారణంగానే పదోతరగతి పరీక్షలు వచ్చాయంటే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు విద్యార్థులు.. ఇక ఇప్పుడు ఇలా తరచూ పరీక్షలు వాయిదా పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు మరింత ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పది పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం సత్వరం తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: