ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 194కు చేరింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులలో ఎక్కువగా మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. నిన్న రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనా భారీన పడి మృతి చెందారు. వైద్య, ఆరోగ్య శాఖ మృతుల గురించి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. 
 
కృష్ణా జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో మరొకరు కరోనా భారీన పడి మృతి చెందారు. ప్రభుత్వం ఈరోజు విడుదల చేసే హెల్త్ బులెటిన్ లో మృతుల గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలోనే 10 కేసులు నమోదు కావడం గమనార్హం. గుంటూరు జిల్లాలో నమోదైన కేసుల్లో గుంటూరుకు చెందినవారే ఏడుగురు కావడం గమనార్హం. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. 
 
ఈ ఐదుగురిలో మొదట కుటుంబ పెద్దకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరై వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా కరోనా నిర్ధారణ అయింది. వీరిలో ఇద్దరు పెద్దవాళ్లు కాగా మిగతా ముగ్గురు చిన్నారులని సమాచారం. రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
 
నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలోని మత ప్రార్థనలకు హాజరైన వారే అని సమాచారం. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నా ఈ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: