ఎలా బాసూ.. రోజు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది.. బయటకు వస్తే పోలీసులు తంతున్నారు.. ఈ లాక్ డౌన్ తో సచ్చే సావుకొచ్చిందని ఎంతో మంది భావిస్తున్నారు. కొంతమంది లాక్ డౌన్ ఉల్లంఘించి తమ ఇష్టానుసారంగా బయటకు వస్తూ లాఠీ దెబ్బలు తింటున్నారు.  అయితే ప్రతిరోజూ కరోనా వ్యాప్తి జరుగుతుందని.. దీన్ని నిర్మూలించే బాధ్యత మన చేతిలోనే ఉందని అంటున్నారు డాక్టర్లు.   లాక్ డౌన్ మొదలు ఇప్పటికీ పన్నెండు రోజుల అవుతుంది.  చాలా మందికి ఇంట్లో ఉండి బోర్ కొడుతుదని తెగ ఫీల్ అవుతున్నారు.. దాంతో లేని పోని కుంటి సాకులు చెబుతూ పోలీసులకు సవాల్ గా మారుతున్నారు.  దాని వల్ల కరోనా విస్తరిస్తుందని.. లాక్ డౌన్ ఉద్దేశం ఇంట్లో ఉండి అరికట్టాలని ప్రభుత్వం చెబున్న విషయం తెలిసిందే. 

 

లాక్‌డౌన్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కి పోతోంది. తిరిగే కాలు, తిట్టే నోరూ ఊరకే ఉండవు కదా. ఇంట్లో ఉండీ ఉండీ ఉండీ.. పిచ్చెత్తిపోయిన ఓ కుర్రాడు బయటికి వెళ్లడానికి ఓ దిక్కుమాలిన ఐడియా వేశాడు. లేబొరేటరీ సిబ్బంది వేసుకునే తెల్లకోటును సంపాదించాడు. చేతులకు గ్లవుజులు, ముఖానికి మాస్క్ పెట్టుకుని ‘పక్కా డాక్టర్ వేషం’ వేసి రోడ్డెక్కాడు.   అతన్ని చూస్తే ఈ సమయంలో నిజంగా డాక్టర్ అనుకుంటారని మనోడు తెగ ఫీల్ అవూతూ ఎదేచ్ఛగొ రోడ్డు పై తిరిగాడు. 

 

కానీ పోలీసులు మరీ అంత చెవిలో పువ్వు పెట్టుకునే వారు ఉండరు కదా.. అబ్బాయి వాలకం తేడాగా ఉండడంతో ఆరా తీశారు.  ఓ పోలీస్ అధికారి ఆ యువకుడిని నిలదీశాడు.. ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు.  అయితే తాను డాక్టర్ అని అర్జంట్ గా హాస్పిటల్ కి వెళ్తున్నా అని అన్నాడు.  దాంతో ఏ హాస్పిటల్ ఎక్కడా మేం వచ్చి దించుతాం అని అనడంతో తడబడి మాట్లాడటం మొదలు పెట్టాడు. పోలీస్ శైలి ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతే, అబ్బాయి లెంపలేసుకున్నాడు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు. నోయిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: